హైదరాబాద్: సమాచార కమిషనర్ల నియమాక ఫైలు గవర్నర్ నరసింహన్ వెనక్కి తిప్పి పంపడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని తేలిపోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి, శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర రావు బుధవారం అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమాచార కమిషనర్ల ఎంపికపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని సమాచార కమిషనర్‌గా ఎంపిక చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ నియామకం రాజకీయ పునరావాస కేంద్రంగా ఉండకూడదన్నదే తమ అభిప్రాయమని చెప్పారు. గవర్నర్ నిర్ణయం ప్రభుత్వానికి, ప్రతిపక్ష తెలుగుదేశంకు చెంప పెట్టు అన్నారు.
గవర్నర్ నిర్ణయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్వాగతిస్తుందని చెప్పారు. ఆయన నిర్ణయం సరియైనదేనని అన్నారు. బాబు, కిరణ్ కుమ్మక్కు విషయాన్ని చాలాసార్లు తమ పార్టీ ఎత్తి చూపించిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాకు తగరన్నారు. కాగా మంగళవారం గవర్నర్ నరసింహన్ ప్రభుత్వం పంపిన సమాచార హక్కు కమిషనర్ల ఫైలును వెనక్కి తిప్పి పంపిన విషయం తెలిసిందే.