మా వాళ్ల చేతకానితనం: టిఆర్ఎస్‌పై మోత్కుపల్లితో జెసి

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 11:04 [IST]
Mothukupalli Narasimhulu and JC Diwakar Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పీడ తెలంగాణకు విరగడ అయ్యేందుకు తాను చండీ యాగం చేస్తానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం చెప్పారు. విపక్షాల ఆందోళన కారణంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్దకు వచ్చిన మోత్కుపల్లి తాను కెసిఆర్ పీడ విరగడ కావాలని యాగం చేస్తానని ప్రకటించారు. కెసిఆర్ సుమారు 700 మంది విద్యార్థులు, యువకులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. త్వరలో చండీ యాగం చేసేందుకు తేదిని ప్రకటిస్తానని చెప్పారు. స్థలం కోసం అన్వేషణ చేస్తున్నానని అన్నారు.

కాగా ఆ తర్వాత మోత్కుపల్లికి మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి తారసపడ్డారు. వెంటనే ఆయనతో మోత్కుపల్లి... టిఆర్ఎస్ పార్టీని సభ నుండి సస్పెండ్ చేయవచ్చు కదా అని అడిగారు. మీ పార్టీ టిఆర్ఎస్‌తో కుమ్మక్కు కావడం వల్లనే సస్పెండ్ చేయడం లేదని ఆరోపించారు. కెసిఆర్ పీడ విరగడ అయ్యేందుకు తాను చండీయాగం చేస్తానని చెప్పారు. యాగం విషయంలో మోత్కుపల్లికి మద్దతు తెలిపిన జెసి కుమ్మక్కు విషయంలో మాత్రం విభేదించారు. టిఆర్ఎస్‌తో కుమ్మక్కు అనవద్దని అది మా వాళ్ల చేతకానితమని చెప్పారు. మా వాళ్లు సస్పెండ్ చేసే ధైర్యం చేయలేక పోతున్నారన్నారు.
English summary
Telugudesam Party leader Mothkupalli Narasimhulu asked former minister JC Diwakar Reddy to suspend TRS mlas.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs