'వైయస్సార్ మౌఖికంగా చెప్పారు, జగన్ సాక్షికి ఇచ్చాం?'

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 9:43 [IST]
YS Rajasekhar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాకు వచ్చిన ప్రభుత్వ ప్రకటనల వైనంపై సిబిఐ అధికారులు సమాచారశాఖ అధికారులను మంగళవారం నిశితంగా ప్రశ్నించారు. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా సీనియర్ ఐఏఎస్, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ప్రాజెక్టు డైరెక్టర్ పార్థసారథిని సిబిఐ అధికారులు మంగళవారం సుమారు మూడు గంటల పాటు విచారించారు. సమాచారశాఖలో డిప్యూటి డైరెక్టర్‌గా చేసి పదవీ విరమణ చేసిన ప్రభాకర రావు, ప్రస్తుత డిప్యూటి డైరెక్టర్ రాజ బాబును ఒకేచోట కూర్చోపెట్టి సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. సమాచారశాఖ కమిషనర్, ఇతర అధికారులు ప్రతిరోజూ ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు, ప్రత్యేక సందర్భాలు, పండుగలకు సంబంధించిన ప్రకటనలపై ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేస్తారని వీరు సిబిఐకి వెల్లడించారని సమాచారం. గతంలో పార్థసారథి సమాచార శాఖ కమిషనర్‌గా పని చేశారు. ఆ సమయంలో జగన్‌కు చెందిన దిన పత్రిక, టెలివిజన్‌కు భారీగా ప్రకటనలు జారీ అయ్యాయి.
అప్పుడే ప్రారంభమైన పత్రికకు ఇతర పత్రికల కన్నా భారీ స్థాయిలో ప్రకటనలిచ్చిన అంశంపై సిబిఐ విచారణ జరుపుతోంది.

ప్రభుత్వ ప్రకటనలు పత్రికలకు జారీ చేయడానికి ఏ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది? లేదా పెద్దలు ఎవరైనా నేరుగా చెబితే నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు జారీ చేస్తారా? అప్పట్లో జగన్ పత్రిక ప్రకటనల విషయంలో సమాచార శాఖపై వైఎస్ ఏమైనా ఒత్తిడి తెచ్చారా? అన్న విషయాలను సిబిఐ అధికారులు తెలుసుకున్నట్లు సమాచారం. సమాచార శాఖ కమిషనర్, ఇతర అధికారులు ప్రతిరోజు ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని, ఆ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు, ప్రత్యేక సందర్భాలు, పండుగలకు సంబంధించిన ప్రకటనలపై ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేస్తారని వీరు వివరించినట్లు తెలుస్తోంది. ఒకే విధమైన సర్క్యులేషన్ ఉన్న రెండు పత్రికలకు ఒకే విధమైన స్పేస్‌తో ప్రకటన ఎందుకు జారీ చేయలేదు? ఒక పత్రికకు సగం పేజీ ప్రకటన ఇస్తే, జగన్ మీడియా సంస్థకు మాత్రం పూర్తి పేజీ ప్రకటన ఇవ్వడానికి కారణం ఏమిటి? ఈ నిర్ణయం వెనుక పెద్దల ఆదేశాలేమన్నా ఉన్నాయా? అన్న కోణంలో సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఒకే స్థాయిలో సర్క్యులేషన్ ఉన్న రెండు పత్రికల మధ్య రెండేళ్లలో ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి రూ.ముప్పై కోట్ల వ్యత్యాసం ఎందుకు వచ్చిందనే విషయాలను తెలుసుకోవడానికి సిబిఐ అధికారులు ఎక్కువగా ప్రయత్నించినట్లు తెలిసింది. పార్థసారథిని విచారించడానికి ముందు జగతి పబ్లికేషన్స్‌లో ప్రకటనల విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు బాధ్యులను సిబిఐ అధికారులు పిలిపించి విచారించారు. జగన్ పత్రికకు జారీ చేసిన ప్రకటనలు ఏ ఉద్దేశంతో జారీ అయ్యాయో తెలుసుకునే ప్రయత్నం సిబిఐ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా వాన్ పిక్ ప్రాజెక్టు ప్రతినిధులను సిబిఐ అధికారులు మంగళవారం విచారించారు. వాన్ పిక్ ప్రతినిధులు రెండుసార్లు సిబిఐ ముందు హాజరయ్యారు.

English summary
CBI asked officers about YSR Congress Party chief YS Jaganmohan Reddy's Sakshi advertisements.
User Comments
narsaraju 22 Feb 2012 03:52 pm
ade YSR koduku aina papaniki Secretariat ki kuda vellani Jagan ni arrest cheyayalni chustaraaa? CONG govt YSR cheppinanatte nadisinda ala aite YSR Chesina amnchi panulu kuad YSR ke chendu tai kadaaaa?
narsaraju 22 Feb 2012 03:51 pm
CONGRESS nayakulaki,IAS Officers ki YSR tappuga pravartistunte adi tappu ani cheppa valasina pani ledaaaaa? alanti appudu YSR CM ga vundaga mantri mandali samavesalalo peekindi emiti...YSR CM ga vundaga mantri vargam anta YSR tappulu chestunna mantri mandali YSR nirnayalaki tala vupindaaa...CM teesu kune bnirnayalalo 99% mantri mandali amodam tone..alanti appudu YSR chesina tappulaki Mantri mandali kuda badyule mari appati mantrulani enduku arrest chesi vicharincharu.
narsaraju 22 Feb 2012 02:12 pm
Ade SAKSHI Publicity valle CONG neggindi anna visayam Sonia,CONG marchi pote valal party ni,valalni evadu kapada ledu..Andhra Pradesh lo CONG ni titte patrikale(eenadu,Andhra Jyothy,TV 9 Yellow syndicate) patrikale vunna time lo YSR garu CONG party ni adu kovataniki SAKSHI ane channel start cehste ade SAKSHI 2 years Back varaku CONG ki bajana cheyya ledaaaa..ippudu Jagan bayataku velle tapaptiiki SAKSHI TV satruvu ai poinda SAKSHI ,YSR la Bikshe CONG adhikaram annadi marchi pote goram
narsaraju 22 Feb 2012 01:16 pm
Donga dochu kuntunte apatam aina cheyayli,police lakaina cheppali,evariki aian complaint cheyayli..ala cheyayka povatam kuda nerame.goram jarugutunte chustu kurchunna vaadu kuda tappu ni samardinchinatte kadaaa alanti appuduSonia to sahaaa,CONG mantrulu anadru YSR donga aite vellu dongale...adi gurtunchu kovali.CONG chesina tappulu anniYSR meedaki gentesi YSR kutumbam meeda burada jallamu anu kunte YSR batiki vundaga ayana chuttu vunna mee meeda kuda burada padutundi..praju samadhanam chebutaru
narsaraju 22 Feb 2012 01:12 pm
Nenu CONG Lucahlani,ee IAS officers ni okate adugu tunnaaa SAKSHI ki ads ivvatame YSR tappu chestunte aaroju ee luchalu enduku matlada ledu...CONG lucahlani nenu okate adugu tunnaaaa YSR dochesadu,aa tappu chesaru,ee tappu chesaru antunnaru ippudu ayana batiki vundaga YSR tappu chestunte tappu ani chepaplsina badyata ayana mantrulaki ledaaa,sonai ki ledaaa veellaki evariki teliyadaaaa?
Srsr Velagala 22 Feb 2012 10:15 am
అంటే ఇదే పని రామోజీ గాడి సంస్తల విషయంలో అందరు కుమ్మక్కై తిన్నార? వాడు అన్నిటా మోసగాడే అని అన్ని సార్లు రుజువు అవుతున్న వాడిని ముట్టుకుంటే విల్లు తగలబడి పోతామన్న భయమా? సిగ్గు సిగ్గు.
Kiran R 22 Feb 2012 10:14 am
ఎడవటానికి ఏమీ వంక లేకపోతె ముళ్ళ కంచే తో గీరుకుని ఏడ్చినట్లు వుంది ఈ వ్యవహారం. నిజం గా ఒకటి రెండు కోట్ల వ్యవహారాలూ అన్నీ సిబిఐ విచారిస్తే బోర్డు మెంబెర్ నుండి ఢిల్లీ పెద్దల వరకు ఒక్కరైనా మన నాయకులు అధికార్లు బయట ఉండటానికి అవకాసం ఉందా? ఏంటో పోను పోను సిబిఐ తన ఉన్నతిని వీడి దిగాజారుతుందేమో అనిపిస్తుంది. వాళ్ళు నాయకుల చీప్ ట్రిక్స్ నుండి బయటకి వచ్చి తమ ఉన్నతిని కాపాడుకుంటే బాగుంటుంది. రేపు వేరే గవర్నమెంట్ వచ్చి వాళ్ళు కూడా సిబిఐ ని ఇలానే వాడుకుంటే లోకల్ గూండా గ్యాంగ్ లకి సిబిఐ కి తేడా ఏముంటుంది?
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs