స్పీకర్ వద్దకు జగన్ ఎమ్మెల్యే పంచాయతీ, ఆనం హామీ

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 10:36 [IST]
Pilli Subash Chandra Bose
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోసు పంచాయతీ బుధవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ వద్దకు చేరుకుంది. పిల్లి సుభాష్ చంద్ర బోసు బుధవారం మొదటిసారి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం స్పీకర్‌ను కలిశారు. తన నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. పిల్లి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నాదెండ్ల మనోహర్ ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని తన చాంబర్‌కు పిలిపించారు. పిల్లి సుభాష్ ఫిర్యాదును ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఆనం నిబంధనల ప్రకారం ఆయన నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

కాగా గత శుక్రవారం తన నియోజకవర్గానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తూ పిల్లి సుభాష్ చంద్ర బోసు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడం వల్ల తన నియోజకవర్గంలో అభివృద్ది పనులు నిలిచి పోయాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ ఇంచార్జిని నిలబెట్టడం వల్ల కూడా తన ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం.
English summary
YSR Congress Party cheif YS Jaganmohan Reddy camp mla Pilli Subash Chandra Bose complainted against Kiran Kumar Reddy government for funds.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs