పెళ్లి రిసెప్షన్: మంత్రి ధర్మానకు నారాయణ సవాల్

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 19:36 [IST]
Narayana
కరీంనగరర్: కుమారుడి పెళ్లి రిసెప్షన్ వల్ల జరిగిన సంఘటనపై మంత్రి ధర్మాన ప్రసాద రావు తనపై చేసిన వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ధర్మాన ప్రసాద రావుకు ఆయన సవాల్ విసిరారు. కుమారుడి పెళ్లి రిసెప్షన్ వల్ల సెంటర్ మారడంతో ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మరణించిన మాట వాస్తవమని ఆయన అన్నారు. మరణించిన వ్యక్తి రామ్మోహన్ గ్రామానికి వెళ్లి ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకుందామని ఆయన మంత్రికి సవాల్ విసిరారు.

తాను చేసిన వ్యాఖ్యలు తప్పయితే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, నిజమని తేలితే ధర్మాన ప్రసాద రావు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. ధర్మాన ప్రసాదరావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. శాసనసభలో ధర్మాన ప్రసాదరావు అబద్దాలు చెప్పడం సరైంది కాదని ఆయన అన్నారు.

ధర్మాన కుమారుడి పెళ్లి రిసెప్షన్ కోసం శ్రీకాకుళంలోని విద్యాలయాన్ని తీసుకోవడం వల్ల వీఆర్వో పరీక్షా కేంద్రాన్ని అక్కడి నుంచి మార్చేశారని, దాని వల్ల అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారని, ఓ వ్యక్తి తన కూతురును మరో కేంద్రానికి తీసుకుని వెళ్తూ ప్రమాదానికి గురై మరణించాడని నారాయణ ఆరోపించారు. ఈ విషయాన్ని చంద్రబాబు బుధవారం శాసనసభలో ప్రస్తావించినప్పుడు తీవ్ర దుమారం చెలరేగింది. నారాయణపై ధర్మాన ప్రసాదరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారాయణ ఏదో మాట్లాడుతారు, చంద్రబాబు కూడా అదే విధంగా మాట్లాడడమేమిటని అడిగారు.
English summary
CPI secretary K Narayana has challenged Minister Dharmana Prasad Rao on Srikakulam centre change.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs