వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26/11 సూత్రదారి హఫీజ్‌పై అమెరికా $10మి.ల రివార్డ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hafiz Saeed
వాషింగ్టన్: లష్కర్-ఇ-తోయిబాకు అగ్రరాజ్యం అమెరికా షాక్ ఇచ్చింది. 26/11 ఘటనకు పథక రచన చేసిన లష్కర్-ఇ-తోయిబా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్‌ను పట్టించిన వారికి $10 మిలియన్ల డాలర్ల బహుమతి ప్రకటించింది. అమెరికా నిర్ణయంపై భారత దేశం హర్షం ప్రకటించింది. ఈ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ స్పందించారు. హఫీజ్ పాకిస్తాన్‌లోనే ఉన్నారని ఆయన అన్నారు. కుట్రదారులను పట్టివ్వాలని తాము పాక్‌ను ఎన్నిసార్లు కోరినా స్పందించలేదని విమర్శించారు.

హఫీజ్ సయిదా ఎఫ్‌బిఐ జాబితాలో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది. ఇతను ప్రస్తుతం పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు భావిస్తున్నారు. స్టేట్ పొలిటికల్ సెక్రటరీ వెండీ షెర్మాన్ భారత్‌కు వచ్చినప్పుడు హఫీజ్ సయీద్ బంధువు అబ్దుల్ రెహ్మాన్ మక్కి పైన కూడా $3 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించినట్లు చెప్పారు.

కొత్త అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి పైన $25 మిలియన్ డాలర్ల బహుమతి ఉంది. హఫీజ్ సయీద్ భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 26/11 ముంబయి ఘటనలో ఇతని హస్తం ఉంది. ఇతని పైన పలు కేసులు ఉన్నాయి. హఫీజ్ పైన ఉన్న పలు కేసులను లాహోర్ కోర్టు తోసిపుచ్చింది.

కాగా 2008 నవంబర్ 26న ముంబయిలో పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. తాజ్ హోటల్ తదితర మూడు ప్రాంతాల్లో వారు దాడులు చేశారు. ఈ దాడిలో 185 మందికి పైగా చనిపోయారు. మన పోలీసులు చేసిన ఎదురు దాడిలో ఉగ్రవాదులు అందరూ చనిపోయారు. కసబ్ ఒక్కడే సజీవంగా పట్టుబడ్డాడు. అతను ఇప్పుడు జైలులో ఉన్నాడు.

English summary
US has announced a $10 million bounty on LeT Chief Hafiz Saeed, the man behind the 26/11 Mumbai attacks. Hafiz Saeed has joined the FBI's list of most wanted terrorists' and currently roaming free in Pakistan despite all strong evidences against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X