చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై మండిపడ్డ చిరంజీవి, 28న ఏమైనా జరగొచ్చు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Chiranjeevi
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసన సభ్యుడు చిరంజీవి గురువారం పరోక్షంగా మండిపడ్డారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కొంతమంది తమ స్వలాభం కోసం ఇతరులను బలి చేస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

నిమ్మగడ్డ ప్రసాద్, సత్యం రామలింగరాజులను కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం బలి చేశారన్నారు. పారిశ్రామికవేత్తలకు ఆశలు చూపించి ప్రలోభ పెట్టి జైళ్లకు వెళ్లేందుకు కారకులయ్యారన్నారు. రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు రాకపోవడానికి కారకులయ్యారన్నారు. పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే స్థితికి తీసుకు వచ్చారన్నారు.

అవినీతి, అక్రమాల బురదలో కూరుకుపోయిన వారు తమకూ ఆ బురద అంటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికల గందరగోళానికి కొందరి అధికార దాహమే కారణమన్నారు.

చెన్నైలోని తన బంధువు ఇంట్లో దొరికిన డబ్బుపై సాక్షి పత్రిక రాసిన కథనాలపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని అన్నారు. వారితో చర్చించిన అనంతరం కోర్టుకు వెళ్తామని చెప్పారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాలలో ప్రచారం చేసేందుకు తాను వెళుతున్నానని, అందుకే తిరుపతి మీదుగా వచ్చానని చెప్పారు.

ఈ నెల 28 తర్వాత ఏమైనా జరగవచ్చునని చిరంజీవి అన్నారు. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ తన విధానాన్ని పాటిస్తోందన్నారు. చెన్నైలోని తన బంధువు ఇంట్లో దొరికిన సొమ్ముతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాగా ఈ నెల 28న కోర్టుకు హాజరు కావాలని జగన్‌కు సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే.

English summary
Rajyasabha Member and Tirupati former MLA Chiranjeevi lashed out at YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy indirectly. He hoped, Congress will win majority seats in upcoming bypolls. He said, he would go to court on Sakshi articles after talking with lawyers about him on Chennai IT rides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X