హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్‌ఎస్‌సి ఫలితాల విడుదల, బాలికలదే హవా

By Pratap
|
Google Oneindia TeluguNews

Tenth Results
హైదరాబాద్: సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (ఎస్ఎస్‌సి) పదో తరగతి పరీక్షల ఫలితాలు గురువారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. మాధ్యమిక శాఖ మంత్రి పార్థసారథి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఆయన పదో తరగతి పరీక్షా ఫలితాల సిడిని విడుదల చేసారు. అయితే ఈసారి ఫలితాల ప్రకటనలో ప్రభుత్వం మార్పులు చేసింది. మార్కులను ప్రకటించకుండా గ్రేడులు మాత్రమే ఇచ్చారు. ఫెయిలైన విద్యార్థులకు ఇ గ్రేడ్ ఇచ్చారు.

2009 అక్టోబర్ 23న మాథ్యమిక విద్యాశాఖ జారీచేసిన జీవోఆర్టీ నెం.592 ప్రకారం 2010లో గ్రేడింగ్ పద్ధతి అమల్లోకి వచ్చింది. అయితే గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా విద్యార్థులు తెలుసుకునేలా అప్పుడు ఏర్పాటు చేశారు. మార్కుల మెమోలపై మార్కులు, గ్రేడులు.. రెండింటినీ నమోదు చేస్తున్నారు. ఇలాగైతే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తడంతో , సంపూర్ణ గ్రేడింగ్ ఎలా ఉండాలో వివరిస్తూ 2011 మే 17న మాథ్యమిక విద్యాశాఖ మళ్లీ జీవోఆర్టీ నెం.419ని విడుదల చేసింది. అప్పటికే పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేసినందున ఆ విషయం మరుగున పడిపోయింది.

దీంతో కొందరు ఈ విషయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. సదరు జీవో ప్రకారం 'సంపూర్ణ గ్రేడింగ్ పద్ధతి'ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖను కోర్టు ఆదేశించింది. దీంతో.. మాథ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి అధికారులతో ఈ అంశంపై గురువారం సమీక్షించారు. మాథ్యమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పాఠశాల విద్యా కమిషనర్ ఎన్.శివశంకర్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ బి.మన్మధరెడ్డి, సంబంధిత అధికారులు దీనిపై చర్చించారు. అనంతరం హైకోర్టు ఆదేశాల ప్రకారం.. మార్కులు ఇవ్వకుండా మొత్తం గ్రేడులే ఇవ్వాలని నిర్ణయించారు.

English summary
SSC results were released by minister Parthasarathy on may 24. Government has decided to give grades with out marks. To reduce pressure on students and unhealthy competition government has decided to give only grades.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X