వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కస్టడీ, క్వాష్ పిటిషన్లపై రేపు హైకోర్టు నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై, తనపై కేసు అక్రమం కాబట్టి కొట్టేయాలని కోరుతూ వైయస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నిర్ణయాలను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తమ నిర్ణయాన్ని రేపు మధ్యాహ్నం 12 గంటలకు వెలువరిస్తామని న్యాయమూర్తి శుక్రవారం సాయంత్రం చెప్పారు.

వైయస్ జగన్ సిబిఐ కస్టడీ పిటిషన్‌పై, ఆయన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం సాయంత్రం వాదనలు ముగిశాయి. వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. తీర్పును ఎప్పుడు వెలువరించేది తెలియజేయకుండా బెంచ్ దిగిపోయారు. ఆ తర్వాత మళ్లీ బెంచ్‌పైకి వచ్చి రేపు నిర్ణయం ప్రటిస్తామని చెప్పారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. హైకోర్టుకు వైయస్ జగన్ సతీమణి భారతి, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి హైకోర్టుకు వచ్చారు.

జగన్ జ్యుడిషియల్ రిమాండ్ కేవలం 9 రోజులు మాత్రమే ఉందని చెబుతూ జగన్‌ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ హైకోర్టును కోరింది. జగన్‌పై కచ్చితమైన ఆధారాలున్నాయని సిబిఐ వాదించింది. జగన్ అరెస్టులో ఏ విధమైన గందరగోళం లేదని చెప్పింది. పెట్టుబడుల వ్యవహారంపై జగన్‌ను విచారించాల్సి ఉందని సిబిఐ చెప్పింది. మోపిదేవిని, విజయసాయి రెడ్డిలను విచారించినప్పుడు పలు విషయాలు ముందుకు వచ్చాయని, వాటిపై జగన్‌ను విచారించాల్సి ఉందని చెప్పింది. మూడు రోజుల పాటు విచారణలో జగన్ ఏమీ చెప్పలేదని తెలిపింది.

కాగా, వైయస్ జగన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం సాయంత్రం డిస్మిస్ చేసింది. సిబిఐ వాదనలతో ఏకీభవిస్తూ సిబిఐ కోర్టు జగన్‌కు బెయిల్ నిరాకరించింది. పార్లమెంటు సభ్యుడు అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. బెయిల్ ఇస్తే జగన్ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందనే సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది.

English summary
High Court reserved its decission on YS Jagan's custody petition filed by CBI and quash petition filed by YS Jagan completed in High Court. CBI court rejected YSR Congress president YS Jagan bail petition. CBI court announced its decision on Friday evening after 7PM. Arguments on YS Jagan's custody petition filed by CBI and quash petition filed by YS Jagan completed in High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X