వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఈగ' దారిలో: కిషన్, ఎదురు చూస్తున్నా... ఉమాభారతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసేంత వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తాము ఈగ తీరులో వెంటాడతామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం అన్నారు. శనివారం ధర్నా చౌక్‌లో దళిత మోర్చా, గిరిజన మోర్చా రాష్ట్ర కమిటీలు 48 గంటల మహాదీక్షకు దిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనుకున్నది సాధించే వరకు సినిమాలో ఈగ విలన్‌ను వెంటాడిన తీరును అనుసరిస్తామన్నారు.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలలో ఎస్సీ, ఎస్టీ సమస్యలపై చర్చించేందుకు వారం రోజులు ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట దళితుల హత్య కాండకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం ఎస్సీ హక్కులతో చెలగాటమాడుతోందని, ప్రజలకు రక్షణ కల్పించేందుకు కమిషన్లు ఏర్పాటు చేయాలని కోరుతుంటే.. పాలకులు మాత్రం ప్రాజెక్టుల కమీషన్ల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం యుగ పురుషులు అవతరించాలని ప్రజలు ఎలా ఎదురు చూశారో.. తెలంగాణ ఆవిర్భావం కోసం తానూ ఎదురు చూస్తున్నానని యువమోర్చా మాజీ అధ్యక్షురాలు, సీనియర్ నేత ఉమా భారతి పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పాలక మండలిని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో దళిత మోర్చా ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్కు వద్ద మూడు రోజుల మహా ధర్నా ప్రారంభమైంది. గంగానది పరిరక్షణ ఉద్యమంలో భాగంగా శ్రీశైలం వెళ్లి వచ్చిన ఉమా భారతి శనివారం సాయంత్రం ధర్నా శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు.

తెలంగాణ కోసం ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారని, ఈ ఉద్యమాన్ని తొలి నుంచీ తాను గమనిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు పాలక మండలి లేకపోవడం దురదృష్టకరమని, ఇక, వారికి న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. పాలక మండలి ఏర్పాటు, తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఎస్సీ, ఎస్టీలు సింహాల్లా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పోరాటాలకు తానూ వెన్నంటే ఉంటానని భరోసా ఇచ్చారు.

English summary
BJP state president Kishan Reddy said that BJP 
 
 will haunt CM Kiran Kumar Reddy like Eega till he 
 
 appoints SC/ST panel chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X