30 సంవత్సరాల వయసు కలిగిన సహానా కుమారి బెంగుళూరుకి చెందిన అథ్లెట్. తొలి ప్రయత్నంలో 1.80 మీటర్లు క్లియర్ చేసిన సహానా తర్వాతి మూడు ప్రయత్నాల్లో 1.85 మీటర్ల ఎత్తును అధిగమించలేకపోయింది. జూన్ 23న హైదరాబాద్‌లో జరిగిన జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 1.92 మీటర్ల ఎత్తుకు ఎగిరి, 2004వ సంవత్సరంలో హైజంప్‌లో కేరళకు చెందిన బాబీ ఆలోయ్సిస్ సృష్టించిన 1.91 మీటర్ల ఎత్తు రికార్డుని అధిగమించింది.
ఐతే లండన్ ఒలంపిక్స్‌లో 1.85 మీటర్ల ఎత్తును అధిగమించలేకపోయి అభిమానులను నిరాశపర్చింది. గ్రూప్-బిలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన స్వెత్లానా రద్జివిల్ 1.96 మీటర్ల ఎత్తుకు ఎగిరి సీజనల్ బెస్ట్ నమోదు చేసి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈమెతో పాటు ఇదే గ్రూప్ నుండి టియా హెల్లీ (బెల్జియం), చాంటూ లోవి (అమెరికా), స్వెత్లానా (రష్యా), ఇరినా గోర్డివా (రష్యా) 1.93మీటర్ల ఎత్తుకు ఎగిరి ఫైనల్‌కు అర్హత సాధించారు.
అదే విధంగా గ్రూప్ ఎ నుండి రూత్ బిటియా (స్పెయిన్), అన్నే చిచిరోవా (రష్యా), ఎమ్మా గ్రీన్ (స్వీడన్), మెలెనా మెల్ ఫోర్ట్ (ఫ్రాన్స్) నుండి 1.93మీటర్ల ఎత్తుకు ఎగిరి ఫైనల్‌కు అర్హత సాధించారు. ఒలింపిక్స్‌లో హైజంప్ ఫైనల్స్ ఆగస్టు 11న జరగనున్నాయి.
తెలుగు వన్ఇండియా