వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి బెయిల్ డీల్: 8 మందిపై చార్జిషీట్ దాఖలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కుంభకోణం కేసులో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సోమవారం కోర్టులు చార్జిషీట్ దాఖలు చేసింది. క్రైమ్ నెంబర్ 6లో అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో 40 పేజీల చార్జిషీటును ఎసిబి అధికారులు దాఖలు చేశారు. ఇందులో 50 మందికి పైగా సాక్షులను పేర్కొన్నారు.

అరెస్టయిన న్యాయమూర్తి పట్టాభి రామారావుతో సహా ఎనిమిది మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఎసిబి చార్జిషీటులో గాలి జనార్దన్ రెడ్డి బంధువు దశరథరామి రెడ్డి, సోదరుడు సోమశేఖర రెడ్డి, కంప్లీ శాసనసభ్యుడు సురేష్ బాబు, పట్టాభి రామారావు, ఆయన కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్ న్యాయమూర్తి చలపతిరావు, న్యాయవాది ఆదిత్య, రౌడీషీట్ యాదగిరిపై అభియోగాలు మోపారు.

ఈ కేసులో ఎసిబి అధికారులు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. మిగతా ముగ్గురిపై ఎసిబి మరో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడానికి 20 కోట్ల రూపాయలు డీల్ కుదిరినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. యాదిగిరి ఇందులో మధ్యవర్తిగా వ్యవహరించారు.

గాలి జనార్దన్ రెడ్డిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి ఎఎంసి కేసులో బెంగళూర్ జైలులో ఉన్నారు. పిటి వారంట్‌పై ఆయనను హైదరాబాదుకు తీసుకుని వచ్చి ప్రశ్నించే అవకాశాలు కూడా అంటున్నారు. కర్ణాటక ఇండిపెండెంట్ శాసనసభ్యుడు శ్రీరాములుకు కూడా ఈ కేసులో ఎసిబి నోటీసులు జారీ చేసింది.

English summary
ACB has filed chargesheet in Karnataka former minister Gali Janardhan Reddy bail deal case. It filed chargesheet on eight members leaving three among 11 arrested in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X