న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాప్ స్టార్స్‌తో వైభవంగా ఒలింపిక్ ముగింపు వేడుకలు

By Nageswara Rao
Olympics 2012 comes to rocking end with a pop party
లండన్, ఆగస్టు 13: 17 రోజుల క్రీడా సమరం. ఎంతో మంది క్రీడాకారులు రికార్డులను తిరగరాస్తే, మరికొంత మంది క్రీడాకారులు పుట్టుకువచ్చి చరిత్రలను సృష్టించారు. ఒలింపిక్స్ క్రీడల్లో ప్రారంభ వేడుకలు ఎంత ముఖ్యమో, ముగింపు వేడుకలు కూడా అంతే ముఖ్యం. మూడు సార్లు ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన నగరంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడంతో పాటు ముగింపు వేడుకలను కూడా అత్యంత ఘనంగా జరిపింది లండన్ మహా నగరం.

30వ లండన్ ఒలింపిక్ ముగింపు వేడుకలకు గ్లామర్, మ్యూజిక్ అంతా తోడై అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ వేడుకలకు పెద్ద సింగర్స్‌తో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరయ్యారు. లండన్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు స్వాంకీ ఒలింపిక్ స్టేడియంలో జరిగాయి. షో పార్టీ తర్వాత ఈ వేడుకల్లో బ్రిటన్‌కు చెందిన పాప్ స్టార్స్‌, సింగర్స్ తమ తమ కార్యక్రమాలతో అలరించారు. మూడు గంటల పాటు జరిగిన ఈ వేడుకల తర్వాత ఒలింపిక్ ఫ్లేమ్‌ని దేదిప్యమానంగా వెలిగించారు.

లండన్ ఒలంపిక్స్‌లో 204 దేశాలకు చెందిన 10,500 అథ్లెట్లు పాల్గోన్నారు. అమెరికా అత్యధికంగా 104 పతకాలను సొంతం చేసుకోని మొదటి స్దానంలో నిలవగా.. 87 పతకాలతో చైనా రెండవ స్దానంలో నిలిచింది. ఆతిథ్య దేశం లండన్ మాత్రం ఈసారి కాస్త మెరుగ్గా రాణించి మూడవ స్దానాన్ని కైవసం చేసుకుంది. ప్రారంభ వేడుకలు మాదిరే ముగింపు వేడుకలను కూడా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు బిలియన్ల ఆడియన్స్ చూస్తారని అంచనా.

80,000 ఆడియన్స్ కూర్చోని ఉన్న స్టేడియంలో స్పైస్ గర్ల్స్‌ పాటలతో హోరెత్తించారు. 2016 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న రియో జి జానిరియో దేశానికి బ్యాటన్‌ను ఈ కార్యక్రమంలో అందించారు. ఈ వేడుకలను సెక్సెస్ చేసేందుకు గాను ఆర్టిస్టిక్ డైరెక్టర్ కిమ్ గావిన్ అహోరాత్రులు కష్టపడ్డారు. ఒలింపిక్స్ ముగింపు వేడులకు పెట్టిన పేరు 'A Symphony of British Music'. పేరులో మ్యూజిక్ ఉన్న విధంగానే ముగింపు వేడుకలు అభిమానులను ఆనందపరిచాయి.

మ్యూజిక్ పుట్టింది ఇక్కడేనేమో అనే విధంగా 50 సంవత్సరాల నుండి ఉన్న బ్రిటిష్ స్ట్రాంగ్ మ్యూజిక్ కల్చర్‌ని ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెర్పామర్స్ 4,100. ఇందులో 3,500 వాలంటీర్స్, 380 స్కూల్ చిల్డ్రన్స్ ఉన్నారు. ఈ ముగింపు వేడుకలలో ఎమిలీ సాండే, మాజీ ప్రధాన మంత్రి విన్స్టన్ చుర్చిల్, మైఖెల్ కైనీ తదితరులు తన ఉత్తమ ప్రదర్శనలతో అలరించారు.

బ్రటిష్-ఐరిష్ బాయ్ బ్యాండ్ 'ఎ డే ఇన్ ద లైఫ్' అదిరిపోయేలా హోరెత్తించారు. ముగింపు వేడుకలలో కాంస్య పతకం గెలుచుకున్న మేరీకామ్ సింగిల్ లైఫ్ సాంగ్‌లో స్టేజి మీదకు వచ్చారు. టాప్ మోడల్స్ నోమీ కాంప్బెల్, కేట్ మోస్‌ల క్యాట్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరి ప్రదర్శన తర్వాత సింగింగ్ సెన్సేషన్ అన్నే లీనక్స్ ప్రద్శనకు అభిమానులు బ్రహ్మరధం పట్టారు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X