న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంత్రి చేతుల మీదగా ఒలింపిక్ విజేతలకు సన్మానం

By Nageswara Rao

న్యూఢిల్లీ, ఆగస్టు 17: లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం నిన్న ఘనంగా సన్మానించింది. న్యూఢిల్లీలోని ధ్యాన్‌చంద్‌ నేషనల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రెజ్లర్లు సుశీల్‌కుమార్‌, యోగేశ్వర్‌దత్‌, షూట్‌ర్లు విజయ్‌కుమార్‌, గగన్‌నారంగ్‌, షెట్లర్‌ సైనా నెహ్వాల్‌, మహిళాబాక్సర్‌ మేరీకోమ్‌ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున క్రీడల మంత్రి అజయ్‌మాకెన్‌ పతక విజేతలను సత్కరించారు.

Ajay Maken felicitates London Olympics medal winners

ఈ సందర్భంలో క్రీడల మంత్రి అజయ్ మాకెన్ మాట్లాడుతూ భారత క్రీడాకారులు లండన్‌ ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చా రని, వారందరిని దేశం తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. అయితే వీరు అందించిన స్పూర్తి రానున్న రియో ఒలింపిక్స్‌పై తప్పకుండా ఉంటుందని, 2016లో జరిగనున్న రియో ఒలింపిక్స్‌లో భారత్‌ మరిన్ని పతకాలు సాధించుకురావాలిని ఆకాంక్షించారు. 2020 ఒలింపిక్స్‌ నాటికి 25 పతకాలు సాధించాలనే లక్ష్యం తో ప్రణాళికను రూపొంది స్తున్నట్టు మాకెన్‌ విరించారు. కార్యక్రమం అనంతరం పతకాలు సాధించిన అథ్లెట్లు ఇండియా గేట్‌లోని అమర్ జవాన్ జ్యోతి దగ్గరికి వెళ్లి పుష్ప గుచ్ఛాలు ఉంచారు.

ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన షూటర్ విజయ్ కుమార్‌కి రూ.30 లక్షల నజరానా ఇవ్వడమే కాకుండా సైన్యంలో సుబేదార్‌ మేజర్‌గా పదోన్నతి ఇచ్చారు. నాలుగు సంవత్సరాల క్రితమే లభించాల్సిన పదోన్నతి ఇప్పటికైనా లభించడంతో న్యాయం జరిగినట్లుగా భావిస్తున్నానని విజయ్ కుమార్‌ అన్నారు. ఇదే వేదిక మీద మహిళల బాక్సింగ్‌లో కాంస్య పతక విజేత మేరీకోమ్‌ను మానెట్‌గ్రూప్‌ సన్మానించింది. ఆమెకు అదనంగా రూ.11లక్షల నగదు బహుమతిని ప్రదానం చేశారు.

ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు విశాఖ స్టీల్‌ప్లాంట్ నజరానా అందించింది. కేంద్ర ఉక్కు మంత్రి భేణీ ప్రసాద్‌వర్మ సమక్షంలో రజతం సాధించిన వారికి రూ. 25 లక్షలు, కాంస్యం సాధించిన క్రీడాకారులకు రూ.20 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు కార్యదర్శి చౌదరి పాల్గొన్నారు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X