వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజేష్ ఖన్నా ఆత్మ క్షోభిస్తుంది: అనితా అద్వానీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajesh Khanna-Anita Advani
ముంబై: బాంద్రాలోని ఆశీర్వాద్ భవనం పేరు మారుస్తారనే ప్రచారంపై బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో సహజీవనం చేసిన అనితా అద్వానీ స్పందించారు. దాని పేరు మారిస్తే రాజేష్ ఖన్నా ఆత్మ క్షోభిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. రాజేష్ ఖన్నా పేరుతో ఆశీర్వాద్ పేరు విడదీయలేకుండా కలిసిపోయిందని ఆమె అన్నారు. రాజేష్ ఖన్నా భవనానికి ఆశీర్వాద్ పేరు తీసేసి వర్ధన్‌ అనే పేరు పెట్టబోతున్నారనే పుకార్లు తెలిసి ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

భవనం పేరు మార్పు చెలరేగుతున్న ఊహాగానాలు నిజమైతే రాజేష్ ఖన్నా ఆత్మ క్షోభిస్తుందని ఆమె అన్నారు. భవనానికి ఆశీర్వాద్ అనే పేరు ఎలా పెట్టారనే విషయాన్ని గుర్తు చేసుకుని కాకాజీ తనకు చెబుతూ ఉండేవారని ఆమె అన్నారు. రాజేష్ ఖన్నా తండ్రి తీవ్రంగా ఆలోచించి ఆశీర్వాద్ అనే పేరు పెట్టారని ఆమె అన్నారు. నువ్వో తారవు అవుతావని, ప్రజలు అభిమానంతో లేఖలు రాస్తారని తన తండ్రి అంటుండేవారని రాజేష్ ఖన్నా తనతో అన్నట్లు ఆమె చెప్పారు.

రాజేష్ ఖన్నా ఆశీర్వాద్ అని అభిమానులు లేఖలు రాస్తారని తన తండ్రి అంటుండేవారని ఆమె అన్నారు. వారంతా ఎల్లవేళలా ఆశీర్వాదిస్తుంటారని, అందుకే ఆ పేరు భవనానికి పెట్టామని చెబుతుండేవారని ఆమె గుర్తు చేశారు. తన తండ్రి పెట్టిన అత్యంత ఇష్టమైన పేరు ఇది అని కాకాజీ అంటుండేవారని ఆమె చెప్పారు. దాన్ని మ్యూజియంగా మార్చడానికి తగిన విధంగా మార్పులు చేస్తూ వచ్చారని ఆమె అన్నారు.

అకస్మాత్తుగా భవనం పేరు మార్చాల్సిన అవసరం ఏం వచ్చిందని, కొత్త పేరు కూడా అంత వినసొంపుగా లేదని ఆమె అన్నారు. భవనంలో అద్వానీ వాటా కోరినట్లు వచ్చిన వార్తలను ఆమె అధికార ప్రతినిధి దాలే భగ్వార్ స్పష్టం చేశారు. తన అభిమానుల కోసం దాన్ని మ్యూజియంగా మార్చాలని రాజేష్ ఖన్నా భావించారనేది మాత్రం ఆమె భావన అన్నారు.

English summary
The late Rajesh Khanna's 'lady love' Anita Advani, who reportedly had a long-standing live-in relationship with the megastar at his Bandra bungalow Aashirwad, is extremely upset, hearing the buzz about the late megastar's bungalow being renamed Vardaan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X