హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమాంధ్ర ఎంపిల ఆస్తులపై దాడులు చేస్తేనే..: యాష్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్/ వరంగల్: సీమాంధ్ర పార్లమెంటు సభ్యులపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల ఆస్తులపై దాడులు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల ఆస్తులపైకి తెలంగాణ మార్చ్ నిర్వహించాలని ఆయన అన్నారు. కెవిపి రామచందర్ రావు, కావూరి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్ వంటి పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి ఘోరంగా ఉందని, తెలంగాణపై నిర్ణయంలో జాప్యం చేస్తే మరింత దారుణంగా మారుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే కాంగ్రెసుకే నష్టమని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ లేఖ ఇస్తే కాంగ్రెసుదే బాధ్యత అవుతుందని, కాంగ్రెసుపై ప్రజల ఒత్తిడి పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతలో కాంగ్రెసు పడుతుందని ఆయన అన్నారు.

తెలంగాణకు ప్యాకేజీలు, పదవులు అవసరం లేదని, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యమని, కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాల్సి ఉందని ఆయన అన్నారు. తెలంగాణను అడ్డుకుంటున్న కెవిపి రామచందర్ రావు కార్యక్రమానికి వెళ్లిన తెలంగాణ నాయకులు తలలు దించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర డైరీ విడుదల కార్యక్రమానికి కొంత మంది తెలంగాణ నాయకులు కూడా వెళ్లిన విషయం తెలిసిందే.

తెలంగాణ ఇస్తుందో, చస్తుందో కాంగ్రెసు పార్టీయే తేల్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన సోమవారం పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు సంబరానికైనా సమరానికైనా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కచ్చితంగా తెచ్చుకుంటామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో 800 మంది ఆత్మబలిదానాలకు కారణం చంద్రబాబు నాయుడేనని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఎలా పోరాడాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. శాసనసభలో తెలంగాణ పదాన్ని చంద్రబాబు నిషేధించారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన బషీర్‌బాగ్ కాల్పులను ప్రజలు మరిచిపోలేరని ఆయన అన్నారు. మోకాళ్లపై నడిచినా చంద్రబాబును ప్రజలు విశ్వసించరని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం సమసిపోతుందని హరీష్ రావు అన్నారు. రాష్ట్రాల ఏర్పాటుకు, నక్సలిజానికి ముడిపెట్టడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పూటకో మాట మాట్లాడుతోందని ఆయన విమర్శించారు.

English summary
Congress Telangana region MP Madhu Yashki lashed out at Seemandhra MPs. He said that Seemandhra MPs properties should be attacked to prevent them from obstructing the decision Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X