అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాళ్లకు నొప్పులు, 20 ఏళ్లుగా రోజుకు 2గంటలు: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
అనంతపురం: పాదయాత్ర వల్ల తనకు కాళ్లు నొప్పులు పుడుతున్నాయని, రాత్రి సరిగా నిద్ర పట్టలేదని, అయినప్పటికీ తాను ప్రజల కోసం వీటిని లెక్క చేయనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. రైతు పోరు బాటకు ఈ యాత్రకు చాలా తేడా ఉందని చెప్పారు. ప్రజల కష్టాలు పెరిగాయని, వారిని ఓదార్చేందుకు ఎవరు లేరన్నారు.

ప్రజలు కన్నీళ్లతో తమ కష్టాలను చెప్పుకుంటున్నారన్నారు. పాదయాత్ర కోసం తాను ప్రత్యేకంగా వ్యాయమం చేయడం లేదన్నారు. ఇరవై ఏళ్లుగా రోజుకు రెండు గంటల పాటు తాను వ్యాయామం చేస్తున్నానని, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నానని, కానీ ప్రత్యేకంగా ఏమీ చేయడం లేదన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అవిశ్వాసం పెట్టడమనేది అయ్యే పని కాదన్నారు.

అంతకుముందు పాదయాత్రలో భాగంగా ఆయన గొల్లపల్లిలో మాట్లాడారు. పేదలలో చైతన్యం రగిల్చేందుకే తాను పాదయాత్రను చేపట్టానని అన్నారు. తన పాదయాత్ర గురించి ఎవరు విమర్శించినా పట్టించుకోనని, అనుకున్నది సాధిస్తానని అన్నారు. పిల్ల కాంగ్రెసు, పెద్ద కాంగ్రెసు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నాయని కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. తన పాదయాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు.

ప్రజలకు న్యాయం చేసేందుకే 117 రోజుల యాత్రను తలపెట్టినట్లు చెప్పారు. మీకు అండగా ఉంటానని, మంచి పరిపాలన రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి జరగాలే శ్రీకారం చుట్టానన్నారు. కాంగ్రెసు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. కొత్తగా పిల్ల కాంగ్రెసు వచ్చిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆకట్టుకున్నాయి. పిల్ల కాంగ్రెసు వేలకోట్లు దోచి పేపర్, టివి పెట్టిందని మండిపడ్డారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu said to media on Wednesday that he will continue his padayatra although pains in body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X