అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభిమానుల పూలతో బాబు కళ్లకు ఇన్ఫెక్షన్, ఆలస్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర గురువారం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. అందుకు కారణం ఆయన కళ్లకు ఇన్ఫెక్షన్ కావడమే. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు అభిమానంతో చంద్రబాబుపై చల్లుతున్న పూలు ఆయనకు ఇన్ఫెక్షన్ కావడానికి దారి తీశాయి. గత పది రోజులుగా ఆయన యాత్ర అనంతపురం జిల్లాలో జరుగుతోంది.

ఈ సందర్భంగా చంద్రబాబుపై బంతిపూలు, ఇతర పూలు జల్లుతున్నారు. ఇవి కళ్లలో పడటంతో ఆయన కళ్ళు ఇన్ఫెక్షన్‌కు గురయ్యాయి. గురువారం ఉదయం వైద్యులు ఆయనను పరీక్షించి ఎక్కవ సేపు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో చంద్రబాబు ఈ రోజు పదకొండు గంటల వరకు రెస్టు తీసుకొని ఆ తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ రోజుతో చంద్రబాబు యాత్ర పదోరోజుకు చేరుకుంది.

బాబు పాదయాత్ర ఈ రోజు ఉదయం ధనేకుల మండలం పెనకలపాడు గ్రామంలో ఉదయం 10.55 నిమిషాలకు ప్రారంభమైంది. ఆయన గ్రామానికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు వివిధ సమస్యలు బాబు ముందు పెట్టారు. ఈ పాదయాత్రకు చిత్తూరు జిల్లా పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలిత్ కుమార్ హాజరై మద్దతు పలికారు.

షోళ్లపురం, హనుమాపురం మీదుగా బాబు యాత్ర సాగుతుంది. చంద్రబాబు వెంట శాసనమండలి సభ్యుడు మెట్టి గోవింద రెడ్డి, ఇంచార్జి దీపక్ రెడ్డి తదితరులు ఉన్నారు. కళ్ల ఇన్ఫెక్షన్ కారణంగా రాత్రి కూడా చంద్రబాబు పాదయాత్ర కాస్త ముందుగానే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబు పైన ఎవరూ పూలు చల్లవద్దని, కాస్త పక్కకు చల్లాలని నేతలు కోరుతున్నప్పటికీ అభిమానులు ఆగలేక పోతున్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu's Vastunna meekosam padayatra has started late today by eye infection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X