హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు డైలాగ్: జగన్ పార్టీకి ట్విట్టర్‌లో లోకేష్ సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-Nara Lokesh
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఇతర రాజకీయ పార్టీలపై ఇప్పటి వరకు విమర్శలు చేసిన సందర్భాలు లేవు. రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల ప్రకటించినప్పుడు గానీ, అంతకుముందు గానీ ఆయన సాఫ్టుగానే స్పందించారు. ఇటీవల బాబు యాత్ర సందర్భంగా మాట్లాడుతూ.. పాలన సరిగా లేదని మాత్రమే స్పందించారు. అంతకుముందు ఓసారి జగన్ పార్టీ గురించి ప్రశ్నిస్తే స్పందించేందుకు నిరాకరించారు.

అయితే నారా లోకేష్ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో మాత్రం జగన్ పార్టీపై విమర్శలు చేశారు. తన తండ్రి ఇటీవల చేస్తున్న పిల్ల కాంగ్రెసు పేరుతో ఆయన ట్విట్టర్‌లో మూడు రోజుల క్రితం ఈ విమర్శ చేశారు. పిల్ల కాంగ్రెసు తన తండ్రి పాదయాత్ర చేస్తున్న అనంతపురంలో వర్షాలు పడవని 25 లక్షల మేర బెట్టింగ్స్ కట్టినట్లుగా తెలుస్తోందని, కాని వర్షం పడిందని అన్నారు. వారు ఇలా బెట్టింగ్స్ కట్టి డబ్బులు పోగొట్టుకునే బదులు పేద ప్రజలకు, అవసరమున్న వారికి ఆ డబ్బులు ఇస్తే మంచిదని సూచించారు.

చంద్రబాబు యాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్న తర్వాత... ఆరు రోజులు, వందకిలోమీటర్లు.. వయస్సు 63.. హ్యాట్స్ ఆఫ్ టు యు నాన్నా అంటూ ట్వీట్ చేశారు. నారా లోకేష్ ట్వీట్స్‌కు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నారా లోకేష్ రెండు రోజులు పాదయాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే.

English summary
TDP chief Nara Chandrababu Naidu's son Nara Lokesh has tweeted in his twitter account that.. pill congress bet 25L that it wont rain in Anantapur during Nara's padayatra, & it rained!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X