హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్ర రాజకీయాలు: స్టార్ డమ్, చిత్రవి'చిత్రాలు'

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనతో రాష్ట్ర రాజకీయాల్లో సినీ తారల జోరు పెరిగింది. తెలుగుదేశం పార్టీకి తెలుగు సినీ తారల తళుకులు అదనపు ఆకర్షణగా ఉంటూ వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో నటీనటుల జోరు చూసి ఇతర పార్టీలు కూడా సినీ తారలకు గాలం వేయడం ప్రారంభించాయి. రాజకీయాల్లో తమ భవిష్యత్తును చూసుకోవడానికి చాలా మంది నటీనటులు ప్రయత్నించినప్పటికీ కొంత మంది మాత్రమే విజయం సాధించారు.

ఎన్టీ రామారావుది తిరుగులేని విజయం

ఎన్టీ రామారావుది తిరుగులేని విజయం

రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీ రామారావు ప్రభంజనం సృష్టించారు. రాజకీయాల్లో అనితర సాధ్యమైన విజయాలను సాధిస్తూ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. దేశరాజకీయాల్లో కాంగ్రెసు వ్యతిరేక రాజకీయాలకు నాయకత్వం వహించారు. తెలుగుదేశం పార్టీ స్థాపన తెలుగు రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టం. ఆయనలా మరొకరు ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నించి విఫలమయ్యారు.

చిరంజీవి మరో ఉదాహరణ

ఎన్టీ రామారావు తర్వాత అంతగా మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో చిరంజీవి. ఆ మాస్ ఫాలోయింగ్‌తో, తన ఇమేజ్‌తో ఆయన ఎన్టీ రామారావులా రాష్ట్ర రాజకీయాలను శాసించాలని ప్రయత్నించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే, ఎన్నికల్లో పార్టీ విఫలం కావడంతో దాన్ని కాంగ్రెసులో విలీనం చేశారు. కాంగ్రెసు పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లి మంత్రి పదవిని చేపట్టారు. రాజకీయాల్లో ఆయన ఇంకా ఓ వెలుగు వెలగాలని చూస్తున్నారు.

 రెబెల్ స్టార్ కృష్ణంరాజు

కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ వంటి సినిమాల ద్వారా రెబెల్ స్టార్‌గా పిలిపించుకున్న కృష్ణంరాజు రెండు సార్లు బిజెపి తరఫున ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి చేయి కాల్చుకున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మురళీమోహన్‌తో పాటు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన కృష్ణంరాజు రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు.

దాసరి నారాయణ రావు

తెలుగు సినీ రంగంలో దర్శకులకు స్టార్ డమ్ సంపాదించి పెట్టినవారు దాసరి నారాయణ రావు. ఆయన సినీ రంగంపై వేసిన ముద్ర సామాన్యమైందేమీ కాదు. ఉదయం ద్వారా పత్రికా రంగంలో విప్లవం తెచ్చిన దాసరి నారాయణరావు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కేంద్ర మంత్రిగా ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలపై కాస్తా వైరాగ్యంతోనే ఉన్నారు.

సూపర్‌గా కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ కూడా రాజకీయాల్లో కాలు పెట్టి వెనక్కి తగ్గారు. అల్లూరి సీతామారామరాజు, మోసగాళ్లకు మోసగాడు వంటి చిత్రాల్లో నటించి ఆయన విశేష ప్రజాదరణ పొందారు. డిటెక్టివ్ సినిమాలకు ఆయన పెట్టింది పేరుగా ఉండేవారు. పాడిపంటలు వంటి చిత్రాల్లో ఆయన సాత్విక పాత్రలు పోషించారు. 1978 - 1989 మధ్య కాలంలో ఆయన సూపర్ స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. అయితే రాజకీయాల్లో తన సత్తా చాటలేకపోయారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు


కలెక్షన్ కింగ్‌గా పేరు పొందిన మోహన్ బాబు ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీపై సమరం కూడా సాగించారు. ఇప్పుడు ఆయన పార్టీ వైపు ఉంటారనేది చర్చనీయాంశంగానే ఉంది.

రాజకీయాల్లోనూ సాఫ్ట్ జయసుధ

హీరోయిన్‌గా తెలుగులో వెలిగిపోయిన తార జయసుధ. అత్యంత క్లిష్టమైన పాత్రల్లో కూడా నటించి, మెప్పించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో ఆమె గత శానససభ ఎన్నికల్లో సికింద్రాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెసు టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. అయితే, ఆమె అప్పుడప్పుడు రాకీయాల పట్ల వైరాగ్యమే ప్రదర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆమె రాజకీయాల్లో కొనసాగుతారా, లేదా అనేది అనుమానంగానే ఉంది.

 ఇంట ఓడి రచ్చ గెలిచిన జయప్రద

తెలుగు సినిమాల్లో అందాల హీరోయిన్‌గా మెరిసిపోయిన జయప్రద ఇప్పుడు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆమె కీలకమైన పాత్ర పోషించారు. రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లి ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆ పార్టీలోనూ లేరు. రాష్టర్ రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ సాగుతోంది.

తెలంగాణ రాములమ్మ విజయశాంతి

తెలంగాణ రాములమ్మ, లేడీ బాస్ విజయశాంతి గురించి చెప్పనే అక్కర్లేదు. మహిళా హీరోగా ఆమె సినిమాల్లో పేరు పొందారు. మహిళా ప్రధానమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తొలుత బిజెపిలో ఉండి, ఆ తర్వాత తెలంగాణ తల్లి పార్టీని స్థాపించి, తెరాసలో స్థిరపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఆమె బలం చేకూరుస్తున్నారు.

చెప్పాలంటే, ఇంకా చాలామంది తెలుగు నటీనటులు రాజకీయాల్లో ఉన్నారు. నరేష్ బిజెపిలో తన జాతకాన్ని పరీక్షించుకున్నారు. కవిత, మురళీమోహన్ వంటి సినీ నటులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మురళీమోహన్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు కూడా. రోజా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు స్టార్ అట్రాక్షన్. రాజశేఖర్, జీవిత దంపతులు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శారద వంటి పాత తరం హీరోయిన్లు కూడా రాజకీయాల్లో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి తార హంగు ఎక్కువే ఉంది.

చిరంజీవి కారణంగా కాంగ్రెసుకు కూడా ఆ అట్రాక్షన్ వచ్చింది. ఏమైనా, మరింత మంది తెలుగు నటీనటులు రాష్ట్ర రాజకీయాల్లో తమ సత్తా చాటే అవకాశాలున్నాయి. పూరీ జగన్నాథ్ వంటి వాళ్లు కూడా రాజకీయాల్లో అడుగు పెట్టాలని అనుకుంటున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మొత్తం మీద, రాజకీయాలకు, సినిమాలకు మధ్య దూరం క్రమంగా తగ్గుతోంది.

అయితే, ఎన్టీ రామరావును బీట్ చేసే నటులు ఇక రాకపోవచ్చు. ఆయన సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఘనమైన చరిత్రను సృష్టించారు. బెదురు లేకుండా కాంగ్రెసు పార్టీపై గర్జించారు. కయ్యానికి కాలు దువ్వారు. ఆయన కుమారులు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

English summary
Few Telugu film stars are succeeding in Andhra Pradesh politics. But no body can beat NT Ramarao. Chiranjeevi made efforts unsuccessfully.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X