వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లవర్స్‌తో లేచిపోతున్నారని: గర్ల్స్ సెల్‌ఫోన్ వాడితే ఫైన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bihar Panchayat to fine Rs 10,000 for use of mobile by girls
పాట్నా: ఉత్తర భారతంలో అమ్మాయిలపై రోజు రోజుకు అరాచకాలు, విచిత్ర నిర్ణయాలు పెరుగుతున్నాయి. తాజాగా యువతులు సెల్‌ఫోన్లు వాడకూడదంటూ బీహార్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. అమ్మాయిలు ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.10వేల జరిమానా విధించాలని కూడా తీర్మానం చేసింది. ఇప్పటికే రాజస్థాన్‌లోని కుల పంచాయతీలు ఇలాంటి తీర్మానాలను చేసింది.

తాజాగా బీహార్‌లోనూ ఇది బయటపడింది. పెళ్లయిన యువతులు.. భర్తలను వదిలి ప్రేమికులతో లేచిపోతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు పంచాయతీ పేర్కొంది. యువతులు ఇతర కులాలు, మతాల వారిని ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటుండడంతో ఇటీవల రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వీరు అమ్మాయిలు భర్తలను వదిలి లేచిపోతున్నారని తీర్మానం చేశారు.

బీహార్‌లోని సుందర్‌వాడి పంచాయతీ ఈ తీర్మానం చేసింది. అమ్మాయిలు సెల్‌ఫోన్ వినియోగిస్తే పదివేలు జరిమానా విధించాలని నిర్ణయించింది. అయితే.. ఈ విషయం వార్తా పత్రికల్లో ప్రచురితం అయిన తర్వాతే తమకు తెలిసిందని, దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని అక్కడి బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి చెప్పారు.

English summary
Day after, Rajasthan village Panchayat had imposed ban over the use of mobile phones by girls, a self styled Bihar Panchayat on Monday levied a fine of Rs 10,000 on girls or women found using mobile phones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X