వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో భారత సంతతి మహిళా వ్యాపారి అదృశ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Lahore court asks cops to trace Indian-origin businesswoman
ఇస్లామాబాద్: భారత సంతతికి చెందిన కెనడా మహిళా వ్యాపారవేత్త పాకిస్తాన్‌లోని లాహోర్‌లో నాలుగు నెలల క్రితం అదృశ్యమైంది. స్థానిక పోలీసులు ఇప్పటి వరకు ఆమె జాడను తెలుసుకోలేకపోయారు జ్యువెల్లర్ రజ్వీందర్ కౌర్ గిల్ 2012 ఆగస్టులో పాకిస్తాన్‌కు వచ్చింది. వజ్రాల వేలానికి సంబంధించిన సదస్సులో పాల్గొనడానికి ఆమె ఇక్కడికి వచ్చింది.

పాకిస్తాన్‌కు వచ్చిన కొద్ది రోజుల పాటు ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అకస్మాత్తుగా ఆమె నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఆమె ఎక్కడికి వెళ్లింది, ఏమైందనేది తెలియడం లేదు. తన కూతురి జాడ తెలుసుకోవడానికి సహకరించాలని కోరుతూ ఆమె తండ్రి సికిందర్ సింగ్ గిల్ లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సంఘటనపై డిసెంబర్ 31వ తేదీలోగా దర్యాప్తు నివేదిక సమర్పించాలని జస్టిస్ షేక్ నజాముల్ హసన్ లాహోర్ పోలీసు చీఫ్ ఆస్లామ్ తరీన్‌ను ఆదేశించారు.

రజ్వీందర్ కెనడా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత లాహోర్‌లోని మూడు హోటళ్లలో బస చేసిందని, కొంత మందిని కలిసిందని పోలీసులు సోమవారం నివేదిక సమర్పించారు. అయితే, ఆమె కలుసుకున్నవారిని సాక్షులుగా ప్రవేశపెట్టలేదు. తన కూతురు ఆగస్టు 25వ తేదీన లాహోర్ వచ్చిందని, 26, 27 తేదీల్లో మెసేజ్‌లు వచ్చాయని, ఆ తర్వాత తమకు ఏ విషయమూ తెలియలేదని సికిందర్ సింగ్ గిల్ చెప్పారు.

రజ్వీందర్ కౌర్ జాడపై ఏ విధమైన ఆధారాలు లభించలేదని పోలీసులు చెప్పినట్లు ఆయన తరఫు న్యాయవాది అఫ్తాబ్ అహ్మద్ బాజ్వా చెప్పారు. పంజాబ్ ఉప ముఖ్యమంత్రి, అకాలీదళ్ నాయకుడు సుక్బీర్ సింగ్ బాదల్‌కు ఆమె దూరపు బంధువు అవుతారు. కెనడా నుంచి లాహోర్ రావడానికి ముందు రజ్వీందర్ కౌర్ పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ఇంతియాజ్ సఫ్దర్ వారాయిచ్ వంటి వారికి ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది.

ఆమె పాకిస్తాన్‌లో యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన బ్లాక్ మ్యాజిక్ ప్రాక్టీషనర్‌ను, మెజీషియన్‌ను కలిసినట్లు తెలుస్తోంది.

English summary
A Canadian woman who hails from India was reported missing in Lahore over four months ago but the local police has only been able to come up with what the petitioner's counsel described as an "ambiguous report" on the investigations conducted so far into the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X