వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరుషాల సంక్రాంతికి ‘పందెం కోళ్లు’ రెఢీ

|
Google Oneindia TeluguNews

విజయవాడ: పల్లెల్లో సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకువచ్చేది కోడి పందేలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు, నిరుపేద నుంచి కోటీశ్వరుని వరకు ఇవి ఎక్కడ జరుగుతున్నా అక్కడ వాలిపోతారు. ‘డేగా..కాకి.. నెమలి.. పింగళి.. పర్ల.. సీతువా.. కొక్కిరాయి.. పూల.. మైల.. రసంగి.. సవళ' ఈ పేర్లన్ని పందెం కోళ్లకు సంబంధించినవే. ఆశ్చర్యంగా ఉన్నా నిజం. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ప్రధాన ఉవవృత్తిగా నిర్వహించే పశువులు, కోళ్లకు అనుబంధంగా ఎడ్డపందేలు, కోడిపందేలు నిర్వహించడం సంక్రాంతి సంబరాల్లో సంప్రదాయంగా వస్తోంది. అయితే ఎడ్ల పందేలు కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమతమయ్యాయి. కోడి పందేలు చట్టరిత్యా నిషేధించబడటంతో పలు గ్రామాల్లో నవంబర్ నుంచి జనవరి వరకు జోరు కొనసాగుతుంది. నగరాల్లో నివశించే వారుకూడా ఈ పండుగను పురస్కరించుకుని కోడి పందేల పై మక్కువతో తమ గ్రామాల్లో వాలిపోతారు.

ప్రధానంగా కత్తి పందేలంటూ రెండు రకాలున్నాయి. ‘కోడిని చూసి ఎంపిక చేసుకునే రకం', ‘ముసుగువేసి కాసే పందెం' ఇలా రెండు విధాలుగా కోడి పందేలను నిర్వహిస్తారు. వీటి పై నిషేధం లేనిరోజుల్లో గ్రామాల్లో ముమ్మరంగా కోండి పందేలు జరిగేవి. పూర్వపు రోజుల్లో పందెం పుంజుల కాళ్లకు కత్తులు కట్టకుండా పందేలు నిర్వహించే వారు. ప్రత్యర్థి కోడి మరణించే వారికి ఈ పోటి జరిగేది. తరువాతి కాలంలో కోళ్ల కాలికి కత్తి కట్టి కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే పందేలు మొదలయ్యాయి. ఒక కోడికి ఎవరూ చూడకండా కత్తి కట్లి ముసుగులో ఉంచి, బరిలో దింపుతారు. ముసుగులో ఉన్న కోడి బలాబలాలతో సంబంధం లేకుండా పందెం రాయుళ్లు పోటీకి దిగాలని ఆహ్వానిస్తారు. దీన్నే ముసుగు పందెమంటారు.

‘‘COCK FIGHTS’’ ready for Sankranthi!

కోడి పందేల్లో ఐదుహెచ్చు, ఆరు హెచ్చు అనే
పందెపు విధానాలు అమలలో ఉన్నాయి. ఐదు హెచ్చుఅంటే గెలిచే కోడిపై ఉన్న నమ్మకంతో పందెం కాసినవారికి నగదుకు 25 శాతం ఎక్కువ, ఆరు హెచ్చు అంటే 50 శాతం అదనం. ఫలానా రంగు కలిగిన కోడి పై ఫలానా సమయంలో ఫలానా రండు కోడి విజయం సాధిస్తుందని తెలిపేది కుక్కుట శాస్త్రం. తమ కోడి రంగు ప్రకారం ఏ సమయంలో పందేనికి సిద్ధం చేయాలనే మహూర్తాలు కూడా నిర్ణయించుకుంటారు.

వాళ్ల చేతిలో పడగానే..?

పందెంగాళ్లు రైతు వద్ద నుంచి మామూలు ధరకే కోడి పుంజులను కొనుగోలు చేస్తారు. వీటిని పందేలకు సిద్ధం చేయటంలో భాగంగా భారీ మొత్తంలో వెచ్చిస్తారు. జీడిపప్పు, బాదం, గుడ్లు వంటి బలవర్థక ఆహారాన్ని క్రమం తప్పకుండా ఇస్తారు. సదరు పుంజు ఒకసారి పందెంలో విజయం సాధిస్తే రెట్టింపు ధర పలుకుతుంది. ఎన్నిసార్లు విజయం సాధిస్తే అంతకంతకూ కోడి ధర పెరిగ, వేల నుంచి లక్షలకు చేరిపోతుంది. ఒక్కసారి ఓడిపోతే మాంసంగానే మిగులుతుంది.

నిషేధం ఉన్నప్పటికి..?

కోడి పందేల మాటున నగదు మార్పిడితో క్రమంగా ఇడి భారీ జూదంగా మారిపోయింది. దీంతోపాటు జీవహింస పెరుగుతోందనే ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. అయినా సంక్రాంతి సంబరాల్లో భాగమైన వీటిని దాదాపు ప్రతి గ్రామంలోనూ చాటుమాటుగా కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

English summary

 ‘Sankranti' is primarily a harvest festival. But thousands of roosters are ‘inhumanly' killed in the name of ‘cockfights'. In many villages, the lush green fields in Krishna district are drenched in blood and several cocks ‘brutally' killed in the fierce fights organised during the three-day festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X