హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చార్మినార్‌కు బాంబు బెదిరింపు ఫోన్: ఆకతాయిల పనే

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Bomb scare at Charminar
హైదరాబాద్: నగరంలోని చార్మినార్‌లో బాంబు పెట్టినట్లుగా గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు ఈ విషయాన్ని సమాచారం అందించారు. బాంబు స్వ్కాడ్ సిబ్బంది చార్మినార్‌లో తనిఖీలు చేస్తోంది. ఫోన్ చేసిన అగంతకుడు బాంబు పెట్టామని, త్వరలో పేలుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఈ కాల్ రావడం పోలీసులను పరుగులెత్తించింది. అయితే ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసిన అనంతరం ఈ కాల్ వచ్చింది. తనిఖీలు చేస్తే ఎక్కడా బాంబు దొరకలేదు. దీంతో ఆకతాయిల పని అని పోలీసులు తేల్చారు.

వారం రోజుల క్రితం అసెంబ్లీకి బాంబు పెట్టినట్లుగా ఫోన్ కాల్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోజు సాయంత్రమే పాతబస్తీలోని పురానాపూల్ వద్ద ఓ ద్విచక్రవాహనం సీటు కింద అమర్చిన బాంబును పోలీసులు శనివారం గుర్తించారు. దాన్ని నిర్వీర్యం చేశారు. బ్యాటరీలు, గన్ పౌడర్‌లతో యాక్టివా వాహనం సీటు కింద బాంబును అమర్చిచారని, సకాలంలో పోలీసులు గుర్తించి దాన్ని నిర్వీర్యం చేయడంతో పెద్ద ముప్పు తప్పింది.

పోలీసులు అనుమానితులను ప్రశ్నించారు. బాంబు ఉన్నట్లు ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే, బాంబు లభించినట్లు వచ్చిన వార్తలను వెస్ట్‌జోన్ డిసిపి ఖండించారు. జిలిటెన్ స్టిక్స్‌ను మాత్రమే స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. బాంబు ఉన్నట్లు జరిగిన ప్రచారం ఓ ఆకతాయి పని అని ఆయన అన్నారు.

రాష్ట్ర శాసనసభ ఆవరణలో బాంబు కలకలం రేగింది. శాసనసభ ఆవరణలో బాంబు పెట్టినట్లు ఆగంతకుడు ఒకతను హైదరాబాదులోని సైఫాబాద్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో బాంబ్ స్క్వాడ్ శానససభ ఆవరణలో తనిఖీలు నిర్వహించింది. డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దించారు. శానససభ ఆవరణను, వివిధ పార్టీల శానససభా పక్ష కార్యాలయాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలించారు. బాంబు పెట్టినట్లు ఫోన్ చేసిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శాసనసభకు సమీపంలో ఉన్న డిజిపి కార్యాలయానికి శుక్రవారంనాడే భద్రతను పెంచారు. తాజా సంఘటనతో శాసనసభకు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

English summary
Bomb scare created havoc in Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X