వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలికని అసభ్యకరంగా చిత్రీకరించి ఫ్రెండ్స్‌కు వీడియోలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Students sent girl videos to friends
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని యలమంచిలి మండలం కుంతేరు గ్రామంలో పదో తరగతి విద్యార్థులు తోటి విద్యార్థినిని అసభ్యకరంగా సెల్ ఫోన్‌తో చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుంతేరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థినితో మరో విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని ఆ విద్యార్థి స్నేహితులు నలుగురు వీడియో తీశారు.

ఈ ఘటన పదిహేను రోజుల క్రితం జరిగింది. అప్పటి నుండి ఆ ఐదుగురు విద్యార్థులు తోటి విద్యార్థినిని అసభ్యంగా సెల్ ఫోన్‌తో చిత్రీకరించిన వీడియోలను ఇతరులకు పంపించారు. ఆమెను వేధింపులకు గురి చేశారు. ఈ విషయం విద్యార్థిని తండ్రి వరకు వెళ్లింది. దీంతో ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయురాలికి విషయాన్ని తెలియజేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

వారిపై యలమంచిలి పోలీసులు 354, 109, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందిత బాలురు మైనర్లు కాబట్టి వారిపై కేసు పెట్టేందుకు పోలీసులు ముందు తటపటాయించినట్లుగా తెలుస్తోంది. అయితే, తండ్రి, తదితరుల ఒత్తిడి కారణంగా కేసును పెట్టారు.

పదిహేను రోజుల క్రితం ఆమెను సెల్ ఫోన్‌లో అసభ్యకరంగా చిత్రీకరించిన సదరు ఐదుగురు విద్యార్థులు బ్లూటూత్ తదితర వాటి ద్వారా వీడియోలను తమ స్నేహితులకు, ఇతరులకు పంపించారు. యలమంచిలి పోలీసులు వారి నుండి సెల్ పోన్లు స్వాధీనం చేసుకున్నారు. సురేష్, సన్ని బాబు, ఫణీంద్ర, శ్రీధర్, బండి బాబులు పోలీసుల అదుపులో ఉన్నారు.

English summary
Five students sent tenth girl student's videos to their friends in West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X