వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరప్పన్ అనుచరుల ఉరితీతపై సుప్రీంకోర్టు స్టే

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ నలుగురు అనుచరుల ఉరితీత అమలుపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. ఉరితీత అమలును బుధవారం వరకు నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారి మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 13వ తేదీన తిరస్కరించారు. దాంతో శిక్ష తగ్గించాలని కోరుతూ ఆ నలుగురు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

రిట్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీన చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్, న్యాయమూర్తులు ఎఆర్ దావే, విక్రమ్‌జీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. ఈ నలుగురి తరఫున న్యాయవాది సమిక్ నారాయణ్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నలుగురు అనుచరులు కూడా శనివారంనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జ్ఞానప్రకాష్, సైమన్, మీసేకర్ మాదయ్య, బిలావేంద్రన్‌లకు 2004లో మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండు దశాబ్దాల క్రితం కర్ణాటకలోని పాలార్‌లో జరిగిన మందుపాతర పేలుళ్ల కేసులో వారికి కోర్టు ఆ శిక్ష విధించింది.

ఆ పేలుళ్లలో 22 మంది మరణించారు. ఈ కేసులో ఆ నలుగురికి 2001లో టాడా ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, వారికి మరణశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ నలుగురు కూడా ప్రస్తుతం కర్ణాటకలోని బెల్గాం జైలులో ఉన్నారు.

English summary

 The Supreme Court on Monday stayed the execution of four aides of slain forest brigand Veerappan till Wednesday. The four associates had approached the apex court seeking commutation after President Pranab Mukherjee rejected their mercy petition on February 13.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X