వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంద్: కార్మికుడి చెవి కోసిన దీదీ పార్టీ కార్యకర్తలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలకు అడ్డూ అదుపు లేకుండా పోయినట్లు కనిపిస్తోంది. భారత్ బంద్ సందర్భంగా బుధవారంనాడు పనికి రాని ఓ కార్మికుడి చెవిని తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు కోసేశారు. వివిధ కార్మిక సంఘాలు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

పనికి హాజరు కాని కార్మికుడి ఎడమ చెవిని తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు గురువారం కోసేశారు. అతడు వెంటనే ఆస్పత్రికి పరుగెత్తాడు. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. భారత్ బంద్‌లో పాల్గొనకూడదని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.

కార్యాలయాలకు వెళ్లకుండా బంద్‌కు మద్దతు ఇస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు కూడా. సమ్మెలో పాల్గొనేవారికి సెలవులు మంజూరు చేసే ప్రసక్తి లేదని ప్రభుత్వోద్యోగులను హెచ్చరించారు.

తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చేయి చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ముర్షిదాబాద్ జిల్లాలో ఓ సంఘటన జరిగింది. పంచాయతీరాజ్ ఉద్యోగి చెవి కోసిన సంఘటన కూడా ఇదే జిల్లాలో జరిగింది.

భారత్ బంద్ విషయంలో మమతా బెనర్జీ బుధవారం ఓ జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు. బంద్ జరుగుతున్న తీరుపై ఆ జర్నలిస్టు మమతా బెనర్జీతో వాదనకు దిగాడు. దీంతో ఆమె ఆ జర్నలిస్టుపై తీవ్రంగా మండిపడ్డారు.

English summary
What can be more brutal than this? A worker faced punishment for not turning up to his workplace on Wednesday, Feb 20 observing the nation-wide bandh called by different trade unions of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X