వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుంటా, ఇప్పట్లో కాదు: రాహుల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: తాను ప్రధానమంత్రి పదవి కోసం ఆరాటపడటం లేదని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు. పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తాను ప్రధాని పదవి కోసం ఆరాటపడటం లేదని, అసలు ఆ విషయానికి తాను అంత ప్రాధాన్యం కూడా ఇవ్వట్లేదని చెప్పారు. పార్టీ పటిష్టత కోసం తాను చిత్తశుద్ధితో పని చేస్తున్నానని చెప్పారు.

తన కర్తవ్యం ప్రధాని మంత్రి పదవిని అధిరోహించడం కాదని, నిర్మాణాత్మక వ్యవస్థ రూపకల్పన అన్నారు. అధికార వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. విపక్షంలో ఉండేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పార్టీతో పాటు కలిసి వచ్చే పార్టీలపై దృష్టి సారిస్తానని చెప్పారు. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పారు. కానీ, ఏదో ఒకరోజు తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటానని చెప్పారు. వారసత్వాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, తన స్థానాన్ని తన పిల్లలకు ఇవ్వమని అడగనన్నారు.

కాగా, ఇటీవల జరిగిన జైపూర్ మేధోమథన సదస్సులో రాహుల్ గాంధీ కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 2014లో యుపిఏ భాగస్వామ్య పక్షాల ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ఫోకస్ అవుతున్నారు. అయన ప్రధానమంత్రి అభ్యర్థిగా అంతకుముందు నుండే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంతో ప్రధాని అభ్యర్థి ఆయనే అనే వాదనకు మరింత బలం చేకూరుంది.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తనకు ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి లేదని చెప్పడం గమనార్హం. ఓ సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవి మరో మూడు నాలుగు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు ఎన్నికలకు పోయి ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను ప్రకటిస్తుందనే వార్తలు కూడా వచ్చాయి.

English summary
Congress Vice President Rahul Gandhi, who is being pitted as the frontrunner to be the UPA's Prime Ministerial candidate for the 2014 Lok Sabha polls, has made it clear that he is not interested in becoming the Prime Minister. "Asking me whether you want to be Prime Minister is a wrong question," Rahul Gandhi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X