వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోమయం!: బూచేపల్లికి జగన్ నుండి హామీ లేదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Buchepalli Siva Prasad Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో టిక్కెట్ల కోసం అంతర్గతంగా విభేదాలు పొడసూపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే టిక్కెట్‌లు ఆశించి పార్టీలో పని చేస్తున్న పలువురు నేతలు ఉన్నారు. కొత్తగా కొందరు అదే నియోజకవర్గాల టిక్కెట్‌ల కోసం పార్టీలో చేరుతుండటం పాత వారికి అసంతృప్తిని కలిగిస్తుందట. ఇటీవల ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ జగన్ పార్టీలో చేరటం ఆ నియోజకవర్గంలో విబేధాలకు దారి తీసిన విషయం తెలిసిందే.

అద్దంకిలో తొలినుంచి పార్టీ కోసం పని చేస్తున్న సీనియర్ నేత గరటయ్యను కాదని ఇటీవలే పార్టీలోకి వచ్చిన గొట్టిపాటికి పెద్దపీట వేయడం వివాదాస్పదమైంది. గరటయ్య అనుచరులు హైదరాబాదు కేంద్ర కార్యాలయానికి వచ్చి తమ అసంతృప్తిని అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చారు. తాజాగా దర్శి శాసనసభ్యుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే అంశంపై అయోమయం నెలకొన్నట్లుగా చెబుతున్నారు.

అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వస్తారని మొదట భావించారు. అయితే, దర్శి టికెట్ ఇస్తామన్న హామీ లభించకపోవడంతో ఆయన జగన్‌ను కలవలేదనే ప్రచారం జరుగుతోంది. సర్వేలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందన్న సాకుతో దర్శి టికెట్ ఇవ్వలేకపోతున్నామని, వేరే నియోజకవర్గం నుంచి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఆ పార్టీ బూచేపల్లికి చెప్పిందట. దర్శి టిక్కెట్ తప్ప మరొకటి వద్దని ఆయన ఖరాఖండిగా చెప్పారట.

ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో నాయకులు చురుగ్గా పని చేస్తున్నారు. అయితే, పాతవారిని పక్కన బెట్టి కొత్తవారిని చేరదీయడంతో అంతర్గత కలహాలు ప్రారంభమయినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారట.

English summary
It is said that Darsi MLA Buchepalli Siva Prasad Reddy did not get any promise from YSR Congress Party chief YS Jaganmohan Reddy on Darsi ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X