నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెబల్ సినిమా ఎఫెక్ట్: డ్రైవర్ గొంతు కోసిన బాలుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rebel
నెల్లూరు: సినిమా ప్రభావంతో ఓ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమాలో లాగా చేయాలని అనుకుని ఓ బాలుడు కారు డ్రైవర్ గొంతును బ్లేడ్‌తో కోశాడు. ఈ విషయాన్ని ఆ బాలుడు స్వయంగా పోలీసుల వద్ద వెల్లడించాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా సైదాపురం సమీపంలోని షామైన్ వద్ద శుక్రవారం జరిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి - చిల్లకూరు మండలం చింతవరానికి చెందిన హైమవతి కుమారుడు (12) గూడూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. చింతవరం నుంచి శుక్రవారం స్కూల్ బస్సులో బయలుదేరిన బాలుడు గూడూరులో సాయిబాబా గుడి వద్ద దిగిపోయాడు.

అక్కడి నుంచి పాత బస్టాండ్ సమీపంలోని కారు స్టాండ్ వద్దకు వెళ్లాడు. తన తల్లి కారు బాడుగకు తీసుకుని రావాలని చెప్పిందని యజమానితో చెప్పాడు. దీంతో అతడు ఇన్నోవా కారును బాలుడి వెంట పంపించాడు. సైదాపురం సమీపంలోని షామైన్ బోర్డు వద్ద ఏమరుపాటుగా ఉన్న డ్రైవర్ కరీముల్లా గొంతును బాలుడు బ్లేడుతో కోశాడు. కారు స్లో కావడంతో దిగి పరుగు పెట్టాడు.

డ్రైవర్ కేకలు వేయడంతో సమీపంలోని వారు బాలుడిని పట్టుకున్నారు. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి రెబల్ సినిమా చూశానని, అదులో కారు దొంగతనం చేసిన విధంగానే తానూ చేయాలని ప్రయత్నించానని బాలుడు నవ్వుతూ చెప్పాడని పోలీసులు అంటున్నారు.

English summary
A boy with the effect of Prabhas's Rebel film tried to attack car driver and take away car. The incident took place in Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X