వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతి కోసం బ్యాట్లతో కొట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Students war in Engineering College
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలోని ఆదిత్య ఇంజనీరింగా కళాశాలలో విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలిక వానగా మారింది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువతితో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు స్నేహంగా ఉండటమే ఘర్షణకు దారి తీసింది. యువతితో ఆంధ్ర యువకుడు స్నేహంగా ఉండటం బీహార్ విద్యార్థులకు రూచించలేదు.

దీంతో ఆంధ్రా విద్యార్థులు, ఉత్తర భారత విద్యార్థుల మధ్య సోమవారం సాయంత్రం ఘర్షణ చోటు చేసుకుంది. అది క్రికెట్ బ్యాట్లు, రాడ్లు తదితర వస్తువులతో విచక్షణారహితంగా కొట్టుకునే స్థాయికి పోయింది. బీహార్ యువతితో ఆంధ్రా యువకుడు స్నేహంగా ఉండటం ఇష్టపడని బీహార్ విద్యార్థులు అతనిపై దాడి చేశారు.

దీంతో ఆంధ్రా విద్యార్థులు వారిపై దాడి చేశారు. ఇరువర్గాలు కొట్టుకున్నాయి. ఈ ఘటనలో పదకొండుమందికి తీవ్ర గాయాలయ్యాయి. బ్యాట్లు, రాడ్లతో కొట్టుకోవడంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఓ సమయంలో కళాశాలలో యుద్ద వాతావరణం ఏర్పడింది.

పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో సమాచారం మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు 144వ సెక్షన్ విధించారు. కళాశాల యాజమాన్యం ఈ సంఘటన వివరాలను గోప్యంగా ఉంచే ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కళాశాల యాజమాన్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ ఉద్రిక్తత

ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ఉదయం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీహార్ విద్యార్థుల వద్ద కత్తులు, మారణాయుధాలు ఉన్నాయని, తమను రక్షించాలంటూ ఆంధ్రా విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. నిన్నటి ఘటనకు వారు ఆందోళన చేపట్టారు.

కాగా, ఈ రోజు బీహార్ రాష్ట్రానికి చెందిన పదిహేనుమంది కళాశాల విద్యార్థులను యాజమాన్యం సస్పెండ్ చేసింది. దీంతో గొడవ సద్దుమణిగింది.

English summary
Clash took place between Andhra students and North Indian students in East Godavati engineering College for girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X