హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంసెట్‌కి ట్రాఫిక్ చిక్కు: సెంటర్ వద్ద జూపూడి హంగామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎంసెంట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఇంజినీరింగ్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 534 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 45 నిమిషాల ముందుగానే విద్యార్థులను పరీక్ష కేంద్రాలలోనికి అధికారులు అనుమతించారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎంసెట్ ఇంజినీరింగ్‌కు క్యూ సెట్ ఎంపికైంది.

పరీక్ష మధ్యాహ్నం ఒకటి గంట వరకు జరుగుతుంది. పలుచోట్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోనికి అనుమతించలేదు. దీంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. చిత్తూరు జిల్లాలో ఎంసెట్ విద్యార్థులను పోలీసులు రాత్రంతా జైలులోనే ఉంచారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు మెడికల్ పరీక్ష జరుగనుంది. ఎంసెట్‌కు రికార్డుస్థాయిలో 3,96,141 దరఖాస్తులు అందాయి. ఇందులో ఇంజనీరింగ్‌కి 2,91,076 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగానికి 1,05,065 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Eamcet Students

ఎంసెట్ నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 33 రీజినల్ సెంటర్ల పరిధిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మెడిసిన్ విభాగపు సెంటర్ల విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రతి 20 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్, 500 మందికి ఓ అబ్జర్వర్, ప్రతి రీజినల్ సెంటర్‌కు ఒక స్పెషల్ అబ్జర్వర్.. ప్రతి టెస్ట్ సెంటర్‌కు ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌ను నియమించారు.

కాగా, ఈ పరీక్ష సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కన్వీనర్ రమణా రావు గురువారం చెప్పారు. "ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించబోం. ఈ నెల 12న ప్రాథమిక 'కీ' విడుదల చేసి, దానిపై 18 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం. జూన్ 2న ఎంసెట్ ర్యాంకులు ప్రకటిస్తాం. కాగా, ఎంసెట్ రాసిన దాదాపు అందరు అభ్యర్థులకు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

జూపూడి హల్‌చల్

కూకట్‌పల్లిలోని రిషి ఇంజినీరింగ్ కళాశాల ఎంసెట్ పరీక్ష కేంద్రానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు వచ్చారు. ఆయనను ముందుగానే లోనికి పంపించడంపై మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం కాకముందే జూపూడిని గన్‌మెన్‌తో సహా లోనికి ఆహ్వానించారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు అయితే ప్రజాప్రతినిధుల్లాగ ఉండాలని మండిపడ్డారు.

English summary
Every candidate who appears for the engineering, agriculture and medicine common entrance test (Eamcet) on Friday is assured of an eligible rank and seat in any engineering college in the state as the total number of applicants for the examination is 2,90,015 against the three lakh engineering seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X