వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిలో మాజీ బిఎస్పీ ఎమ్మెల్యే కాల్చివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Uttar Pradesh
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ రాజకీయ నాయకుడు హత్య చేయబడ్డాడు. బహుజన సమాజ్‌వాది పార్టీ మాజీ నేత, మాజీ శాసన సభ్యుడు అయిన సర్వేష్ కుమార్ సింగ్ అలియాస్ టిపును శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఉత్తర ప్రదేశ్‌లోని అజమ్‌గర్ జిల్లా సగ్రీ ప్రాంతంలో ఆయన ఉండగా ముగ్గరు వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. అతను ఇంటి బయట ఉన్న సమయంలో కాల్పులు జరిపారు.

సర్వేష్ కుమార్ సింగ్ చనిపోవడంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పలు వాహనాలను దగ్ధం చేశారు.

కుటుంబ కలహాల కారణంగానే సర్వేష్ హత్య గావింపబడ్డాడనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన మద్దతుదారులు మాత్రం దానిని కొట్టి పారేస్తున్నారు.

కాగా కొద్దికాలం క్రితం బిఎస్పీని వీడిన సర్వేష్... వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ లేదా బిజెపి నుండి ఏదైనా లోకసభ స్థానం నుండి పోటీ చేయాలని భావించారు.

English summary
A former Bahujan Samaj Party (BSP) leader along with two others has been shot dead by unidentified assailants, here, on Friday. According to reports, former BSP leader and ex-MLA Sarvesh Singh alias ‘Tipu' was shot dead in broad-day light in Sagri area of UP's Azamgarh district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X