వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేఖలో సమం, సాక్షిలో సమైక్యాంధ్ర: జగన్‌కు యనమల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishna
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ లేఖలో సమన్యాయమంటూ, సాక్షిలో సమైక్యాంధ్ర అంటూ గందరగోళం సృష్టిస్తోందని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు బుధవారం విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో ఢిల్లీకి వాళ్లే వెళ్లలేదని, కాంగ్రెసు పెద్దలు పిలిపించారన్నారు. వారి ఢిల్లీ పర్యటన ఏర్పాటు పర్యవేక్షణ అంతా 10 జన్‌పథ్ నుండే జరుగుతోందన్నారు.

రాష్ట్రపతితో ఇంటర్వ్యూ నుంచి జంతర్ మంతర్ దీక్ష వరకు ఏర్పాట్లు అన్ని సోనియా నిర్దేశంలో కాంగ్రెసు నేతలే చేస్తున్నారని, అందుకే అడగ్గానే ప్రధాని, రాష్ట్రపతి, కేంద్రమంత్రులు అందరూ సమయమిచ్చారన్నారు. జైల్లో జగన్ దీక్ష నిబంధనలకు విరుద్దమని ప్రధాని అనకపోవడమే ఆ రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనమన్నారు. ప్రధానికి విజయమ్మ ఇచ్చిన లేఖలో జైల్లో జగన్ దీక్ష చేస్తున్నారని ఉందని గుర్తు చేశారు.

ప్రధాని, రాష్ట్రపతులకు ఇచ్చిన లేఖలో సమన్యాయం అని చెప్తూ.. సీమాంధ్ర జిల్లాల్లో మాత్రం సమైక్యాంధ్ర అన్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎక్కడా చెప్పలేదన్నారు. తెలంగాణపై సిడబ్ల్యూసి నిర్ణయం ఆ పార్టీకి ముందే తెలుసన్నారు. సొంత మీడియాలో సమైక్యాంధ్ర అంటూ ప్రచారం చేసుకుంటూ, లేఖల్లో మాత్రం సమన్యాయం అంటున్నారని విమర్శించారు.

రాజకీయ లబ్ధి కోసమే: గాలి

రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకున్నదని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు వేరుగా విమర్శించారు. అభివృద్ధి అంతా హైదరాబాద్‌కు పరిమితమైన ఈ సమయంలో రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సిద్ధమవడం రాజకీయ లబ్ధికోసమేనన్నారు.

English summary

 Telugudesam Party senior MLA Yanamala Ramakrishna on Wednesday questioned YSR Congress Party stand on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X