హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం పునరాలోచన: కావూరి, టిలోను తుఫాన్‌కు సెగ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao
న్యూఢిల్లీ/హైదరాబాద్: సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంతో విభజనపై కేంద్రం పునరాలోచనలో పడిందని కేంద్ర జౌళీ శాఖ మంత్రి, ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు శుక్రవారం న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విదేశాల నుంచి వచ్చాక సీమాంధ్రలో ఉద్యమాన్ని చల్లార్చే ప్రకటన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సీమాంధ్రుల ఆందోళనలో న్యాయముందని చెప్పారు. సీమాంధ్ర ప్రజల సెంటిమెంటును అధిష్టానం గుర్తించిందన్నారు. ఆంటోని కమిటీ హైదరాబాదుకు వచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. తాము అధిష్టానం ముందు, ఆంటోని కమిటీ ముందు సమైక్యవాదం వినిపించామన్నారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయాల మేరకు తాము నడుచుకుంటామని కావూరి చెప్పారు. సీమాంధ్ర ప్రజలు హైదరాబాదును వదులుకునేందుకు సిద్ధంగా లేరని చెప్పారు.

లాయర్ల ఘటనపై ఏరాసు

రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వద్ద శుక్రవారం న్యాయవాదుల మధ్య ఘర్షణపై మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి స్పందించారు. న్యాయవాదుల ఘర్షణ బాధాకరమన్నారు. విభజనతో వచ్చే సమస్యల పరిష్కారానికి చర్చలు మొదలు పెట్టాలని, కూర్చొని చర్చించుకుందామని సూచించారు.

తుఫాన్ సినిమాకు అడ్డంకులు

రంగారెడ్డి జిల్లా వికారాబాదు పట్టణంలోని సినీ మాక్స్‌లో ప్రదర్శిస్తున్న తుఫాన్ సినిమాను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఈ రోజు ఉదయం అడ్డుకున్నారు. సమైక్యవాదిగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి చిరంజీవి కుమారుడి సినిమాను ప్రదర్శించేందుకు వీల్లేదని వారు నినాదాలు చేశారు. సీమాంధ్రలోను పలు ప్రాంతాల్లో తుఫాన్‌ను అడ్డుకున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, యాడికి, ఉరవకొండ, కర్నూలు జిల్లాల్లోని ఆదోని, డోన్, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో అడ్డుకున్నారు.

English summary
Central Minister Kavuri Sambasiva Rao on Friday said High Command will re think on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X