మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారుల డిశ్చార్జ్: కుటుంబసభ్యుల ఆనందం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆరు రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 12 మంది చిన్నారులను బుధవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. తమ పిల్లలు క్షేమంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చిన్నారుల డిశ్చార్జ్ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఆసుపత్రి వద్ద సందడి వాతావరణం నెలకొంది.

చిన్నారులను చూసేందుకు కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఇలా ఉండగా మిగతా ఆరుగురు చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ లింగయ్య తెలిపారు. ప్రశాంత్ (6), వరుణ్ గౌడ్ (7), శరత్ (6) పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు.

చిన్నారుల డిశ్చార్జ్

చిన్నారుల డిశ్చార్జ్

మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆరు రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 12 మంది చిన్నారులను బుధవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

చిన్నారుల డిశ్చార్జ్

చిన్నారుల డిశ్చార్జ్

తమ పిల్లలు క్షేమంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

చిన్నారుల డిశ్చార్జ్

చిన్నారుల డిశ్చార్జ్

చిన్నారుల డిశ్చార్జ్ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఆసుపత్రి వద్ద సందడి వాతావరణం నెలకొంది.

అభినంద్

అభినంద్

చిన్నారులను చూసేందుకు కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు.

హరీశ్

హరీశ్

మిగతా ఆరుగురు చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ లింగయ్య తెలిపారు.

సాయిరాం

సాయిరాం

డిశ్చార్ అయిన వారిలో సాయిరాం, రుచితా గౌడ్, సాత్విక, మహిపాల్‌రెడ్డి, సద్భావన్‌దాస్, కరుణాకర్, సందీప్, అభినందు, శివకుమార్, హరీష్, శ్రావణి, త్రిష ఉన్నారు.

కరుణాకర్

కరుణాకర్

మిగిలిన వారిలో ధనుష్ గౌడ్ (దర్శన్), నబిరా ఫాతిమా, నితూష ఆరోగ్య పరిస్థితికి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారిని సాధారణ వార్డుకు తరలిస్తామని తెలిపారు.

మహిపాల్ రెడ్డి

మహిపాల్ రెడ్డి

ప్రశాంత్ (6), వరుణ్ గౌడ్ (7), శరత్ (6) పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు.

సావిక్

సావిక్

డిశ్చార్జ్ చేసిన చిన్నారులకు వారానికి అవసరమైన మందులతోపాటు ఇద్దరు డాక్టర్లు, నలుగురు నర్సులతో విద్యార్థులకు ఇళ్ల వద్దనే వైద్య పరీక్షలు అందిస్తారని డాక్టర్ లింగయ్య తెలిపారు.

సందీప్

సందీప్

ఏదైనా అవసరం అయితే వెంటనే యశోద ఆస్పత్రికి తీసుకొచ్చేలా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పారు.

ఆస్పత్రిలో చిన్నారి

ఆస్పత్రిలో చిన్నారి

చిన్నారులకు మొత్తం 60మంది వైద్యుల బృందం, 120 మంది నర్సులు వైద్య సేవలందించారని ఆయన తెలిపారు.

శివకుమార్

శివకుమార్

తమ బిడ్డల ఆరోగ్యం ఏమవుతుందోనని వారం రోజులుగా నిద్రాహారాలు లేకుండా గడిపిన ఆ తల్లిదండ్రుల్లో బుధవారం కాస్త వూరట కనిపించింది. తమ చిన్నారులను ప్రేమతో అక్కున చేర్చుకున్నారు.

చిన్నారుల డిశ్చార్జ్

చిన్నారుల డిశ్చార్జ్

దేవుడు కరుణించాడు.. సర్కారు స్పందించింది.. వైద్యుల కృషి ఫలితంగానే తమ పిల్లలు ప్రాణాలు దక్కాయని, ప్రాణాప్రాయం నుంచి పిల్లలు బయటపడ్డారని మీడియా ముందు బాధిత తల్లిదండ్రులు తెలిపారు.

చిన్నారుల డిశ్చార్జ్

చిన్నారుల డిశ్చార్జ్

12మందిలో 9 మందిని తీసుకుని తల్లిదండ్రులు సొంతూళ్లకు తీసుకువెళ్లగా.. ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉంటామని మరో ముగ్గురు తల్లిదండ్రులు కోరడంతో వైద్యులు అంగీకరించారు.

చిన్నారుల డిశ్చార్జ్

చిన్నారుల డిశ్చార్జ్

తల్లిదండ్రులు ఇంటికి బయలుదేరిన సమయంలో వారి వెంట ఉన్న చిన్నారులు ‘అంకుల్ టాటా' అంటూ వైద్యుల నుంచి సెలవు తీసుకున్నారు.

యశోద వైద్యులు

యశోద వైద్యులు

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, డిప్యూటీ సిఎం రాజయ్య, ఇతర మంత్రులు ఆస్పత్రికి వచ్చి పిల్లలను తరచూ పరామర్శిస్తూ.. మెరుగైన వైద్యం అందించాలని చెప్పారని, ఖర్చుకు వెనుకాడవద్దని చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

వైద్యులు, తల్లిదండ్రులతో..

వైద్యులు, తల్లిదండ్రులతో..

డిశ్చార్జ్ అయిన అనంతరం యశోద ఆస్పత్రి వైద్యులు, తల్లిదండ్రులతో ఫొటోలు దిగిన చిన్నారులు.

మిగిలిన వారిలో ధనుష్ గౌడ్ (దర్శన్), నబిరా ఫాతిమా, నితూష ఆరోగ్య పరిస్థితికి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారిని సాధారణ వార్డుకు తరలిస్తామని తెలిపారు. డిశ్చార్ అయిన వారిలో సాయిరాం, రుచితా గౌడ్, సాత్విక, మహిపాల్‌రెడ్డి, సద్భావన్‌దాస్, కరుణాకర్, సందీప్, అభినందు, శివకుమార్, హరీష్, శ్రావణి, త్రిష ఉన్నారు.

డిశ్చార్జ్ చేసిన చిన్నారులకు వారానికి అవసరమైన మందులతోపాటు ఇద్దరు డాక్టర్లు, నలుగురు నర్సులతో విద్యార్థులకు ఇళ్ల వద్దనే వైద్య పరీక్షలు అందిస్తారని డాక్టర్ లింగయ్య తెలిపారు. ఏదైనా అవసరం అయితే వెంటనే యశోద ఆస్పత్రికి తీసుకొచ్చేలా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పారు.

చిన్నారులకు మొత్తం 60మంది వైద్యుల బృందం, 120 మంది నర్సులు వైద్య సేవలందించారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, డిప్యూటీ సిఎం రాజయ్య, ఇతర మంత్రులు ఆస్పత్రికి వచ్చి పిల్లలను తరచూ పరామర్శిస్తూ.. మెరుగైన వైద్యం అందించాలని చెప్పారని, ఖర్చుకు వెనుకాడవద్దని చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

English summary
Almost a week after the horrific bus-train collision in Medak, as many as 12 children were discharged from Yashoda Hospital in Secunderabad on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X