హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

7లక్షల విలువచేసే 150 గుట్కా బ్యాగ్స్ సీజ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నిషేధించిన గుట్కాలు, ఖైనీలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 7 లక్షల విలువ చేసే సరుకును, వ్యాన్‌ను సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం సిపి సమావేశ మందిరంలో డిసిపి ఎం. శ్రీనివాసులు మీడియాకు తెలిపారు.

హైదరాబాద్ నుంచి విశాఖకు గుట్కా ప్యాకేట్లు రవాణా అవుతున్నట్లు సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సిఐ జవి రమణ, సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం అల్లిపురం గోకుల్ థియేటర్ వద్ద నిఘా పెట్టారు. స్థానిక చలువతోట ఎస్ఆర్ఎంటి వెనక గల కిరణా వ్యాపారి ఇనకోటి కొండలరావు గోడౌన్ వద్ద వ్యాన్ నుంచి గుట్కా సంచులను దించుతుండగా దాడులు చేశారు.

గుట్కా, ఖైనీల సీజ్

గుట్కా, ఖైనీల సీజ్

నిషేధించిన గుట్కాలు, ఖైనీలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గుట్కా, ఖైనీల సీజ్

గుట్కా, ఖైనీల సీజ్

ఇద్దరు నిందితుల నుంచి రూ. 7 లక్షల విలువ చేసే సరుకును, వ్యాన్‌ను సీజ్ చేశారు.

గుట్కా, ఖైనీల సీజ్

గుట్కా, ఖైనీల సీజ్

గుట్కాల సీజ్‌కు సంబంధించిన వివరాలను శుక్రవారం సిపి సమావేశ మందిరంలో డిసిపి ఎం. శ్రీనివాసులు మీడియాకు తెలిపారు.

గుట్కా, ఖైనీల సీజ్

గుట్కా, ఖైనీల సీజ్

హైదరాబాద్ నుంచి విశాఖకు గుట్కా ప్యాకేట్లు రవాణా అవుతున్నట్లు సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సిఐ జవి రమణ, సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం అల్లిపురం గోకుల్ థియేటర్ వద్ద నిఘా పెట్టారు.

గుట్కా, ఖైనీల సీజ్

గుట్కా, ఖైనీల సీజ్

స్థానిక చలువతోట ఎస్ఆర్ఎంటి వెనక గల కిరణా వ్యాపారి ఇనకోటి కొండలరావు గోడౌన్ వద్ద వ్యాన్ నుంచి గుట్కా సంచులను దించుతుండగా దాడులు చేశారు.

వ్యాను డ్రైవర్ కె. సంపత్ రావును, కిరణా వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. వ్యానులో గల 89 బ్యాగులు, గోడౌన్‌లో నిల్వ ఉంచిన 61 గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని జివిఎంసి ఆహార భద్రతాధికారికి అప్పగించారు.

గుట్కాలు హైదరాబాద్ నారాయణగూడకు చెందిన జయంత్ ద్వారా రవాణా జరుగుతున్నట్లు నిందితులు చెప్పారని డిసిసి తెలిపారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలియజేశామని చెప్పారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్ సిఐ తిరుపతి రావు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అప్పారావులు పాల్గొన్నారు.

English summary

 The City Task Force (CTF) police seized a large quantity of gutka and khaini packets in the wee hours of Friday and arrested a van driver and kirana merchant in this regard. The cops seized around 89 bags of the banned material from a van and another 61 bags from a godown in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X