హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

4గురు యువకుల ప్రాణాలు తీసిన కరెంటు తీగ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నాంపల్లి హజ్ హౌస్ వద్ద హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. వైర్లు బస్టాప్‌పై పడడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రికి తరలించగా నలుగురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. మృతులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అంతా పాతికేళ్లలోపు వారే. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్‌రెడ్డి ప్రమాద స్థలాని పరిశీలించారు. హజ్ యాత్రకు పయనమవుతున్న రెండో బృందానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వీడ్కోలు పలికి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాదంలో మరణించినవారిని రాకేష్, రూపేష్, కోమల్, సుశీల్ యాదవ్‌గా గుర్తించారు. వీరంతా నగరంలో జిమ్మి సర్కస్‌లో పని చేస్తుంటారని తెలిసింది. సోమవారం సాయంత్రం భారీ వర్షం కురియడంతో వీరంతా హజ్ హౌస్ ముందున్న బస్టాప్‌లో నిలబడ్డారు. సరిగ్గా అదే సమయంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి బస్టాప్‌పై పడిపోయాయి. దీంతో పెద్ద మొత్తంలో విద్యుత్ పాస్ కావడంతో బస్టాప్‌లో ఉన్న ఏడుగురు యువకులకు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా సుశీల్ యాదవ్ మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు రూపేష్, రాకేష్, కోమల్ చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రాణం తీసిన కరెంటు తీగ

ప్రాణం తీసిన కరెంటు తీగ

సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నాంపల్లి హజ్ హౌస్ వద్ద హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. వైర్లు బస్టాప్‌పై పడడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రాణం తీసిన కరెంటు తీగ

ప్రాణం తీసిన కరెంటు తీగ

స్థానిక ఆసుపత్రికి తరలించగా నలుగురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉంది.

ప్రాణం తీసిన కరెంటు తీగ

ప్రాణం తీసిన కరెంటు తీగ

మృతులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అంతా పాతికేళ్లలోపు వారే. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

ప్రాణం తీసిన కరెంటు తీగ

ప్రాణం తీసిన కరెంటు తీగ

ప్రమాదంలో మరణించినవారిని రాకేష్, రూపేష్, కోమల్, సుశీల్ యాదవ్‌గా గుర్తించారు. వీరంతా నగరంలో జిమ్మి సర్కస్‌లో పని చేస్తుంటారని తెలిసింది.

మహమూద్ అలీ

మహమూద్ అలీ

ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి కిషన్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

మహమూద్ అలీ

మహమూద్ అలీ

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్‌రెడ్డి ప్రమాద స్థలాని పరిశీలించారు.

మాజీద్ హుస్సేన్

మాజీద్ హుస్సేన్

హైదరాబాద్ నగర మేయర్ మాజీద్ హుస్సేన్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

మహమూద్ అలీ

మహమూద్ అలీ

ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు కోరారు.

మహమూద్ అలీ

మహమూద్ అలీ

విద్యుత్ ప్రమాద ఘటన చోటు చేసుకున్న తర్వాత అక్కడికి భారీగా స్థానికులు, ప్రజలు చేరుకున్న దృశ్యం.

English summary

 Four persons were electrocuted and two injured when high-tension wire snapped and fell on people standing at a bus stop near Haj House under Abids police station limits on Monday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X