హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తల్లి, బావ నిర్వాకం: 6రోజులు బాలికపై అరబ్ షేక్ రేప్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనను కంటికి రెప్పలా కాపాడాల్సిన తన తల్లి, బావ తనతో ఏడాది వ్యభిచారం చేయిస్తున్నారని, వారి బారినుంచి రక్షించాలని ఓ అమ్మాయి పౌరహక్కుల ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, జాతీయ కౌన్సిల్ సభ్యురాలైన జయవింద్యాల, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇక్బాల్ ఖాన్‌లకు మొరపెట్టుకుంది. వీరు బాధితురాలికి ధైర్యం చెప్పి బుధవారం మీడియా ముందుకు తీసుకువచ్చారు.

వివరాల్లోకి వెళితే.. వట్టేపల్లి ప్రాంతానికి చెందిన అమ్మాయి(14)తో సంవత్సరం నుంచి సోదరి భర్త బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. సోదరిని, తనను చంపేస్తానంటూ బావ బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో గత్యంతరం లేక ఒప్పుకున్నానని బాధితురాలు వాపోయింది. కన్నతల్లి కూడా చిత్రహింసలు పెట్టినట్లు కన్నీటి పర్యంతమైంది. వారిద్దరూ తనను పలు ఫాంహౌస్‌లకు పంపేవారని చెప్పింది. ఆరు రోజుల క్రితం ఓ అరబ్ షేక్‌కు అంటగట్టారని వాపోయింది.

A girl allegedly complaints on Brother in law and mother

అతను విమానంలో గోవాకు తీసుకుపోయాడని చెప్పింది. అక్కడ నలుగురు వ్యక్తులు కలిసి ఓ హోటల్‌కు తీసుకెళ్లారని తెలిపింది. అక్కడ దాదాపు ఆరు రోజులు గడిపానని మంగళవారం మళ్లీ విమానంలో తనను తీసుకొచ్చిన షేక్ పహాడీ షరీఫ్ దర్గా వద్ద వదిలాడని అమ్మాయి తెలిపింది. తన బంధువైన యువకుడికి ఫోన్ చేసి బుధవారం తెల్లవారుజామున ఇంటినుంచి పారిపోయి ఫలక్‌నుమా స్టేషన్‌కు ఇద్దరం వచ్చామని తెలిపింది.

ఆ తర్వాత పౌరహక్కుల ప్రజా సంఘం ప్రతినిధులను ఆశ్రయించినట్లు బాధితురాలు పేర్కొంది. జయవింద్యాలను కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరింది. బాలిక బావను, తల్లిని కఠినంగా శిక్షించాలని జయవింద్యాల, ఇక్బాల్‌ఖాన్‌ డిమాండ్‌ చేశారు. పాతబస్తీలో పేదలకు విద్య లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం స్పందించి పాతబస్తీలోని పేదలకు స్వయం ఉపాధి కల్పించాలనికోరారు.

English summary
A girl allegedly complaints on Brother in law and her mother, in Hyderabad on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X