విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా సాగునీటి అధికారి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ ఇరిగేషన్ శాఖలో హెడ్ డ్రాఫ్ట్స్‌మేన్‌గా పనిచేస్తున్న విజయకుమార్ 10 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనకాపల్లి గోపరాజుపురం వద్ద కల్వర్ట్ నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన పూడి వెంకటేశ్వరరావు ఆ పనిని సకాలంలో పూర్తి చేయలేకపోయాడు.

కాంట్రాక్ట్ కాలపరిమితి పెంచాలని వెంకటేశ్వరరావు కోరాడు. అందుకు 15 వేల రూపాయలు కావాలని విజయకుమార్ డిమాండ్ చేశారు. తను అంత ఇవ్వలేనని వెంకటేశ్వరరావు చెప్పడంతో, 10 వేల రూపాయలు ఇవ్వాలని విజయకుమార్ డిమాండ్ చేశాడు. ఈ 10వేల రూపాయలను విజయకుమార్ గురువారం విశాఖలోని కార్యాలయంలో తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

మాటు వేసి ఉన్న ఎసిబి డిఎస్పీ నరసింహారావు, సిబ్బంది రామకృష్ణ, రమణమూర్తి, గణేష్ దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేశారు.

ఎసిబి వలలో అధికారి

ఎసిబి వలలో అధికారి

ఓ కాంట్రాక్టు పొడిగింపు కోసం లంచం తీసుకుంటూ విశాఖపట్నం సాగునీటి పారుదల శాఖలో పనిచేస్తున్న డ్రాఫ్ట్స్‌మన్ ఎసిబి అధికారులకు చిక్కాడు.

ఎసిబి వలలో అధికారి

ఎసిబి వలలో అధికారి

సాగునీటి అధికారి విజయ్‌కుమార్‌ను ఎసిబి అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. అతను పది వేల రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఎసిబి డిఎస్పీ ఇలా..

ఎసిబి వలలలో అధికారి

ఎసిబి వలలలో అధికారి

సాగునీటి అధికారి విజయ్‌కుమార్ నుంచి ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు ఇదే. అతను పదివేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

ఎసిబి వలలో అధికారి

ఎసిబి వలలో అధికారి

విశాఖపట్నం సాగునీటి శాఖలో డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేస్తూ ఎసిబి అధికారులకు చిక్కిన లంచావతారం విజయ్ కుమార్ ఇతనే..

English summary
ACB officials arrested irrigation officer, while taking bribe from a contractor in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X