వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావాలనే దాడి, బాబు ప్రభుత్వం ఉందా: అంబటి ధ్వజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati alleges Kodela supporters attacked
గుంటూరు: ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎమ్మెల్యే ముస్తఫాతో కలసి వెళుతున్న తనపై స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుచరులే దాడి చేశారని వైయస్సార్ కాంగ్రెసు సీనియర్ నేత అంబటి రాంబాబు ఆదివారం ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున ఏడుగురు ఎంపీటీసీలు గెలుపొందగా, టీడీపీకి నలుగురు సభ్యులున్నారన్నారు.

దీంతో, ఇన్ని రోజుల పాటు ఈ ఏడుగురిని తనతో పాటే, తన నివాసంలో పెట్టుకున్నానని చెప్పారు. ఈ రోజు ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో వీరిని తీసుకుని ముప్పాళ్ల వెళుతుండగా రెండు, మూడు వాహనాలలో వచ్చిన కోడెల అనుచరులు తమపై దాడి చేశారన్నారు.

తమ పార్టీకి చెందిన ఏడుగురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారన్నారు. సాక్షాత్తూ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తే ఇలాంటి అరాచకాలకు పాల్పడితే ప్రజాస్వామ్యం బతికే ఉందా? అనిపిస్తోందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బతికుందా? చచ్చిపోయిందా? అని అంబటి ప్రశ్నించారు.

దాదాపు 20 నుంచి 25 మంది తమపై దాడికి పాల్పడ్డారన్నారు. వారు కావాలనే దౌర్జన్యం చేశారన్నారు. ఎంపీపీ ఎన్నికలలో టీడీపీ దౌర్జన్యానికి పాల్పడే అవకాశముందని ముందే డీజీపీకి చెప్పినప్పటికీ రక్షణ కల్పించలేక పోయారన్నారు. అంతకుముందు కూడా కావాలనే ఎంపీపీ ఎన్నికను వాయిదా వేశారన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు ఎన్నిక వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. తమ పైన దాడి చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు.

English summary
YSR Congress Party leader Ambati Rambabu alleged that the attackers were Kodela Sivaprasad supporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X