వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు, జగన్‌తో అంజన్ భేటీ, పార్టీ మారేందుకు కాదని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలను వేర్వేరుగా కలిశారు.

అంజన్ కుమార్ యాదవ్ చంద్రబాబు నివాసంకు వచ్చారు. ఇది చూసిన విలేకర్లు పార్టీ మారే ఉద్దేశ్యం ఉందా అని ప్రశ్నించారు. దానికి ఆయన మాట్లాడుతూ.. తన కూతురుకు వివాహం నిశ్చయమైందని, పెళ్లికి ఆహ్వానించేందుకు తాను వచ్చానని తెలిపారు. పెళ్లి పత్రికను ఇచ్చి బాబును ఆహ్వానించానని తెలిపారు. అనంతరం అంజన్.. జగన్ వద్దకు వెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించారు.

Anjan Kumar invites Chandrababu and YS Jagan

మహమూద్ అలీ ఇంటికి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం రంజాన్ పర్వదినం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటికి వెళ్లారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

మోడీ రంజాన్ శుభాకాంక్షలు

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ రోజు ప్రజల మధ్య శాంతిని, సోదరభావాన్ని, ఐకమత్యాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నట్టు ట్లిట్టర్లో తెలిపారు.

English summary
Former MP Anjan Kumar invites Chandrababu and YS Jagan to his daughter's marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X