వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవే భయపడాలి: చంద్రబాబు శ్వేతపత్రం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. నిధుల ఖర్చులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. సోమవారం నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తమ హయాంలో అనుసరించిన నీటిపారుదల విధానాలను వివరించారు. కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. వేల కోట్లు ఖర్చుచేసినా క్షేత్రస్థాయిలో నీరు కనిపించలేదన్నారు.

ఒకేసారి 86 ప్రాజెక్టులను 1.95 లక్షల కోట్లతో పూర్తి చేసేందుకు తీసుకున్న నిర్ణయం కూడా సరికాదన్నారు. దీనివల్ల ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తికాని పరిస్థితి తలెత్తిందన్నారు. మొత్తం ప్రాజెక్టులను ఐదేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు, పదేళ్లు దాటినా వాటిని పూర్తి చేయలేకపోయారన్నారు. దీంతో ఆ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయన్నారు. ఇక ఎత్తిపోతల పథకాలపైనా స్పష్టత లేకుండా ముందుకు సాగారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల ఎంత భూమికి సాగునీరు అందించవచ్చు, అందుకు కావాల్సిన విద్యుత్ వంటి అంశాలపై సక్రమంగా ఆలోచించలేదన్నారు.

విభజన కారణంగా మరికొన్ని కష్టాలు వచ్చాయని, కృష్ణా, గోదావరి నదులపై హక్కులు రాష్ట్రాలు దాటి కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కమిటీ చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సాగుకు నీరు అందించేందుకు పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరవే మనల్ని చూసి భయపడే పరిస్థితి తీసుకురావాలన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా త్వరగా పూర్తి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

త్వరలోనే అన్ని ప్రాజెక్టులనూ ప్రాధాన్యతాపరంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. నీటిని సద్వినియోగం చేసేందుకు గతంలో నీరు- మీరు పథకం స్థానంలో నీరు- చెట్టు పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి నీటి చుక్క నేలలోకి ఇంకేలా చూడడంతోపాటు, పచ్చదనం పెంపొందించేందుకు చెట్లునాటే కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. నిధుల ఖర్చులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

సోమవారం నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తమ హయాంలో అనుసరించిన నీటిపారుదల విధానాలను వివరించారు.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. వేల కోట్లు ఖర్చుచేసినా క్షేత్రస్థాయిలో నీరు కనిపించలేదన్నారు.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

విభజన కారణంగా మరికొన్ని కష్టాలు వచ్చాయని, కృష్ణా, గోదావరి నదులపై హక్కులు రాష్ట్రాలు దాటి కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కమిటీ చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

ఈ పరిస్థితుల్లో సాగుకు నీరు అందించేందుకు పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరవే మనల్ని చూసి భయపడే పరిస్థితి తీసుకురావాలన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu today released a white paper on the irrigation sector to highlight the "follies" of the erstwhile Congress government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X