వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంసెట్ రద్దుకు ఎపి ప్రభుత్వ యోచన: గంటా వెల్లడి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం నిర్వహిస్తున్న ఎంసెట్‌ను రద్దు చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారంనాడు వెల్లడించారు. తమిళనాడు తరహాలో మెడికల్, ఇంజనీరింగ్ అడ్మిషన్లను నిర్వహించనుంది. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఈ రెండు కోర్సుల్లో అడ్మిషన్లు ఇస్తారు.

ఎంసెట్‌ను రద్దు చేసి, తమిళనాడు తరహాలో అడ్మిషన్లను నిర్వహించడానికి ఉండే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఓ కమిటీని వేయనుంది. సోమవారంనాడు ఈ కమిటీ తమిళనాడు సందర్శిస్తుంది. ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ ఇస్తూ ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్మిషన్లు కల్పించారు.

 AP government to cancel EAMCET

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్థానికత అంశాలను ముందుకు తెచ్చింది. దీంతో ఎంసెట్ కౌన్సెలింగ్‌లో జాప్యం జరుగుతూ వస్తోంది. దీంతో ఎంసెట్‌ను రద్దు చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంసెట్ అడ్మిషన్లను తెలంగాణ ప్రభుత్వమే క్లిష్టతరం చేసిందని గంటా శ్రీనివాస రావు అన్నారు. ఎంసెట్‌తో సంబంధం లేకుండా ప్రవేశాలు కల్పించే అంశం గురించి ఆలోచన చేస్తున్నామని ఆయన చెప్పారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గంటా చెప్పారు.

English summary
Andhra Pradesh governement is thinking about the cancellation of EAMCET, which was held to give admissions to the students in Medical and Emgineering courses. Minister Ghanta Srinivas Rao told about this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X