వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వావి వరుస మరిచి యువతిపై అత్యాచారయత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ శివారు గుడి తాండాలో ఇద్దరు యువకులు వావి వరుసలు విస్మరించి దారుణానికి పూనుకున్నారు. వరుసకు సోదరి అయిన 13 యేళ్ల బాలికను బలవంతంగా అడవి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆ ఇద్దరు కామాంధుల చెర నుంచి తప్పించుకుని వచ్చిన ఆ యువతి తాండా వాసుల సహకారంతో బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే - సోదరి వరసయ్యే బాలికపై ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి ప్రయత్నించారు. గూడూరు మండలంలోని బొద్దుగొండ శివారు గుడి తండాకు చెందిన దంపతులకు 13 ఏళ్ళ కుమార్తె ఉంది. నిరక్షరాస్యురాలైన బాలిక పశువుల కాపరిగా ఉంటోంది.

attempted rape on a girl in Warangal district

పశువులను అడవిలో మేత నిమిత్తం మరో కాపరికి అప్పగించేందుకు తోలుకెళ్లింది. ఇంతలో, అదే తండాకు చెందిన ఇద్దరు యువకులు అడవిలో కాపుకాచి ఆమె నోరు మూసి ఎత్తుకెళ్లారు. భయభ్రాంతులకు గురి చేశారు. వివస్త్రను చేసి బెదిరించారు. ఎలాగో వారి బారి నుంచి తప్పించుకున్న యువతి తండాలోకి పరుగుతీసింది. దీనిని గమనించిన మహిళలు బాలికకు చీరకప్పి, విషయం తెలుసుకున్నారు. అ

నంతరం, బాలిక తల్లిదండ్రులతో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కామాంధులు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

English summary
Two boys attempted to rape a girl in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X