విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

4గురి మృతదేహాల వెలికితీత: రోదనలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలోని విఐపి రోడ్డులో గురువారం చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో మృతి చెందిన నలుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. భవనం వద్ద మట్టి పెళ్లి కూలిపడటంతో అక్కడ రాడ్ బెండింగ్ చేస్తున్న ఈ నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు.

ప్రమాదం పొంచి ఉన్న విషయం స్థల యజమానికి కానీ, కాంట్రాక్టర్‌కుకానీ, జివిఎంసి అధికారులకు కానీ తెలియదా? స్థానికులు ప్రశ్నిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు తమకేమీ పట్టదన్నట్టు వ్యవహరించడం వలనే ఇంత ఘోరం జరిగిందని ఆరోపిస్తున్నారు.

గురువారం జరిగిన ఈ దుర్ఘటనా స్థలాన్ని చూసిన ఎవ్వరికైనా హృదయం ద్రవించకమానదు. కొద్ది సేపటి కిందటే ఇంటి నుంచి భార్య పిల్లలను వదిలి విధుల్లోకి వచ్చిన కార్మికులు విగత జీవులైపోవడాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బంధువుల రోదైనలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. కాగా, మృతుల కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించి, యాజమాన్యాలు చేతులు దులుపుకొన్నాయి.

రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు సంఘటన స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ సంఘటనపై విచారణకు ఒక కమిటీని నియమిస్తామని అన్నారు. కమిటీ ఇచ్చిన రిపోర్డు బట్టి సంబంధింత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి అందాల్సిన ఆర్థిక సహాయం అందేలా చూస్తానన్నారు. దీన్ని గుణపాఠంగా తీసుకుని ఇక నుండి బహుళ అంతస్తుల నిర్మాణాలలో అధికారులు భద్రత చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

బిజెపి ఎమ్మెల్యే

బిజెపి ఎమ్మెల్యే

ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే.

అయ్యన్నపాత్రుడు

అయ్యన్నపాత్రుడు

ప్రమాదం జరిగిన స్థలానికి సందర్శిస్తున్న రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు.

బాధితులతో..

బాధితులతో..

బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మంత్రి అయ్యన్నపాత్రుడు.

కుటుంబసభ్యుల రోదనలు

కుటుంబసభ్యుల రోదనలు

ప్రమాద ఘటనలో తమ కుటుంబ పెద్ద చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు.

వెలికితీత

వెలికితీత

ప్రమాద ఘటనలో మృతి చెందిన కూలీల మృతదేహాలను బయటికి తీసుకువస్తున్న దృశ్యం.

వెలికితీత

వెలికితీత

మట్టి పెళ్లల కింద కూరుకుపోయిన కార్మికుల మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యం.

వెలికితీత

వెలికితీత

మట్టి పెళ్లల కింద కూరుకుపోయిన కార్మికుల మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యం.

ప్రమాద స్థలి

ప్రమాద స్థలి

నలుగురు కార్మికుల మృతికి కారణమైన విశాఖ నగరంలోని భవన నిర్మాణ స్థలం.

మృతుడు

మృతుడు

మట్టిపెళ్లల కింద చిక్కుకున్న నాలుగు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు.

వెలికితీత

వెలికితీత

మృతులను కృష్ణ, రాము, పరదేశ్, సోమేష్‌లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు ఒడిశా రాష్ట్రానికి, మరో ఇద్దరు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారని కార్మికులు తెలిపారు

వెలికితీత

వెలికితీత

మృతుల కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించి, యాజమాన్యాలు చేతులు దులుపుకొన్నాయి.

కూరుకుపోయిన మృతదేహం

కూరుకుపోయిన మృతదేహం

మట్టిలో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికితీస్తున్న సహాయక సిబ్బంది.

రోదన

రోదన

మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదైనలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది.

వెలికితీసిన మృతదేహం

వెలికితీసిన మృతదేహం

మట్టిపెళ్లలు ఒక్కసారిగా పడటంతో తీవ్రగాయాలపాలై మృతి చెందిన ఓ కార్మికుడు.

English summary
Panchayat Raj Minister Ayyanna Patrudu, who visited the construction site at VIP Road in Visakhapatnam where four migrant workers were buried alive when earth caved in on Thursday, promised to initiate action against the builders and the officials concerned in GVMC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X