హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెయిల్ కండిషన్స్ ఓకే, మరి ఫిక్సింగ్‌వి: జగన్‌పై లోకేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Nara Lokesh
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్‌లో వినూత్నంగా స్పందించారు.

జగన్‌కు బెయిల్ కండిషన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయని... మరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ కండిషన్స్ ఏమిటో చెప్పాలని నారా లోకేష్ ప్రశ్నించారు. నారా లోకేష్ ట్వీట్స్‌కు పలువురు స్పందించారు.

కాగా, నారా లోకేష్ గత కొంతకాలంగా రాష్ట్రంలోని పలు అంశాల పైన ట్విట్టర్‌లో స్పందిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల పైన ఆయన ట్విట్టర్‌లో విమర్శలు చేస్తున్నారు. ఇటీవల తన తండ్రి ట్విట్టర్ అకౌంట్ తీసుకున్నప్పుడు ఆహ్వానం పలికారు.

మూడు రోజుల క్రితం అధికార కాంగ్రెసు పార్టీ ఫ్యానుకు కరెంట్ ఇస్తూ, కారుకు డీజిల్ పోస్తోందంటూ ట్వీట్ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల గుర్తు కారు.

English summary

 Telugudsam Party chief Nara Chandrababu Naidu's son Nara Lokesh tweeted that 'Bails conditions are clear, what are the match fixing conditions YSRCP?'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X