హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్య ఆస్తులు రూ. 325 కోట్లు, రూ. 4 కోట్లు అప్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభా స్థానం నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు, సినీ హరో బాలకృష్ణ ఆస్తుల విలువ మొత్తం రూ.325.47 కోట్లు ఉంది. నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో బాలయ్య తన కుటుంబం ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన పేర, తన భార్య వసుంధరాదేవి, కుమారుడు మోక్షజ్ఞ పేరిట ఉన్న మొత్తం స్థిర, చరాస్తుల విలువ రూ.325.47 కోట్లుగా అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో చెప్పారు.

చరాస్తులు బాలకృష్ణ పేరిట రూ.104.85 కోట్లు, భార్య పేరిట రూ.92.33 కోట్లు, కుమారుడి పేరిట రూ.17.55 కోట్లుగా ఉంది. అదే విధంగా స్థిరాస్తుల కింద బాలకృష్ణ పేరిట రూ.65.66 కోట్లు, భార్య పేరిట రూ.38.46 కోట్లు, కుమారుడి పేరిట రూ.5.38 కోట్లుగా ఉంది. బాలకృష్ణ దాదాపు రూ.4 కోట్ల అప్పులు చూపించారు.

బాలయ్య తన వద్ద 400 గ్రాముల బంగారం, ఐదు కిలోల వెండి, భార్య వద్ద 3,487 గ్రాముల బంగారం, 300 క్యారెట్ల వజ్రాలు, 31 కిలోల వెండి, కుమారుడి వద్ద 220 గ్రాముల బంగారం, 17 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 7.05 ఎకరాల వ్యవసాయ భూమి, భార్య పేరిట నానక్మ్‌గ్రూడ శేరిలింగంపల్లి వద్ద రెండు ఎకరాల భూమి ఉన్నట్లు తెలియచేశారు.

 Balakrishna's assets value Rs325 crores

తన పేర రాయదుర్గం మండలం పన్‌మక్తలో 1111 చదరపు అడుగుల ప్లాట్, కుమారుడి పేరిట మాదాపూర్‌లో 940 చదరపు అడుగుల ప్లాట్ ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా వాణిజ్య సముదాయాల కింద బాలకృష్ణకు రూ.65.62 కోట్లు విలువ చేసే ఆస్తులు, భార్య పేరిట రూ.38.46 కోట్లు, కుమారుడి పేరిట రూ.5.38 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వివరించారు.

బాలకృష్ణ పేర అప్పులు రూ.2.57 కోట్లు, భార్య పేర రూ.1.30 కోట్లు, కుమారుడి పేర రూ.11.54 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. బాలకృష్ణ పేరిట అబిడ్స్, నాంపల్లి బిఓఐ బ్యాంకులు, బంజారాహిల్స్, చెన్నై ఐఎన్‌జి వైశ్యా బ్యాంకులు, ముషీరాబాద్ పరిధిలోని ఆంధ్రాబ్యాంక్‌లోని ఖాతాల్లో మొత్తం రూ.1.45 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. బాండ్లు, షేర్ల విషయానికి వస్తే రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోలో 12 శాతం షేర్లు, సికింద్రాబాద్‌లోని గాస్‌మండిలో 1/7 వంతు షేర్, హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ ఇన్నోటెక్ ప్రైవేటు లిమిటెడ్‌లో డైరెక్టర్ కింద 49 శాతం షేర్లు, హెరిటేజ్‌ఫుడ్ లిమిటెడ్‌లో 6,820 షేర్లు, రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్, నామ్‌వే నెట్‌వర్క్ లిమిటెడ్, బాలకృష్ణ హెచ్‌యూఎఫ్‌లో 1/3 వ వంతు షేర్ల మొత్తం విలువ రూ.96,53,57,097గా నమోదు చేశారు.

నాలుగు వాహనాలకు సంబంధించి మొత్తం రూ.1.8 కోట్లుగా చూపించారు. బాలకృష్ణ పేరిట రూ. 4,68,33,450, భార్య పేరిట రూ. 2,27, 99,050, కుమారుడి పేరిట ర .78, 87,170 ఎల్‌ఐసి బాండ్లు ఉన్నాయి. అద్దె రూపంలో బాలకృష్ణకు రూ.11, 74,129, భార్యకు రూ.5,01,492, కుమారుడి రూ.1,97, 003 ఆదాయం వస్తున్నట్లు బాలకృష్ణ చూపించారు.

English summary

 According to affidavit filed with nomonation Telugudesam party leader and Hindupuram assembly segment in Ananthapur district Balakrishna's assets value is Rs 325 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X