వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐనా కనుమూరి రిజైన్ చేయట్లేదు, వీఐపీ దర్శనం రద్దు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bapiraju is not quitting TTD board though he has been asked to resign: Minister
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి మాణిక్యాల రావు సోమవారం అన్నారు. రాజీనామా చేయాలని బహిరంగంగా కోరినా ఆయన స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆన్‌లైన్లలో టీటీడీ రూ.300 దర్శనం టికెట్లకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఆన్‌లైన్ బుకింగ్ అమలులోకి రాగానే వీఐపీ టెకెటింగ్‌ను రద్దు చేస్తామన్నారు. తిరుమలలో వీఐపీ దర్శనాలు ఉండొద్దనేది తమ అభిప్రాయన్నారు. దేవాలయాల భూములు అన్యాక్రాంతం కానివ్వమన్నారు. ప్రధాన దేవాలయాల్లో ఎన్టీఆర్ సుజల పథకం అమలు చేస్తామని మంత్రి తెలియజేశారు.

కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి నుంచి ఇక తప్పుకుంటే మేలని మాణిక్యాల రావు కొద్ది రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. పదవి నుంచి తప్పుకోకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకుంటారని ఆయన అప్పుడు హెచ్చరించారు.

యూపీఏ హయాంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు ఇంకా పదవులు పట్టుకు వేళ్ళాడడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. కనుమూరి బాపిరాజు నేతృత్వంలోని ధర్మకర్తల మండలి బాధ్యతల నుంచి వైదొలగాలని స్పష్టం చేశారు.

English summary
Kanumuri Bapiraju is not quitting TTD board though he has been asked to resign, says Minister Manikyala Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X