మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ అండ: జగ్గారెడ్డి ఝలక్, తెరాస ఆగ్రహం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు.

బుధవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర నేతల సమక్షంలో ఆయన కమలతీర్థం పుచ్చుకున్నారు. అనంతరం పార్టీ ఆయనను లోకసభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించింది.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఏబీవీపీ నుండి క్రియాశీలక కార్యకర్తనను చెప్పారు. తాను మొదటి నుండి బీజేపీ వ్యక్తినే అన్నారు.

జగ్గారెడ్డి

జగ్గారెడ్డి

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి కాంగ్రెసు నుండి బీజేపీలో చేరి, మెదక్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.

జగ్గారెడ్డి

జగ్గారెడ్డి

జగ్గారెడ్డి ఉదంతంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్‌తో పాటు రాష్ట్ర పార్టీ నేతలు ఖంగు తిన్నారు. మూడు డీసీసీల తాజా నియామకాలను రద్దు చేసింది.

 జగ్గారెడ్డి

జగ్గారెడ్డి

కొత్త నియామకాలను ఇప్పట్లో చేపట్టవద్దని తెలంగాణ పీసీసీని ఆదేశించింది. తనకు పోటీ చేసే ఉద్దేశ్యం లేదని జగ్గారెడ్డి చెప్పడంతో.. ఆయనను కాంగ్రెసు పార్టీ డీసీసీ అధ్యక్షునిగా ఎంపిక చేసింది.

 జగ్గారెడ్డి

జగ్గారెడ్డి

దీంతో పాటు రంగారెడ్డి, అదిలాబాద్ డీసీసీ అధ్యక్షులను నియమించింది. డీసీసీ నియామకాల పైన ఇతర వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఈ జాబితాను ఏఐసీసీ తాత్కాలికంగా నిలిపేసింది.

 జగ్గారెడ్డి

జగ్గారెడ్డి

ఈ నెల 25, 26 తేదీల్లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యాచరణ సదస్సులో జగ్గారెడ్డి పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షునిగా నియమిస్తామని, పార్టీ అభ్యర్థి గెలుపుకు సహకరించాలని దిగ్విజయ్ కోరారు.

 జగ్గారెడ్డి

జగ్గారెడ్డి

దిగ్విజయ్ ఢిల్లీకి వెళ్లి పార్టీ అధ్యక్షురాలు సోనియాతో చర్చించి పార్టీ అభ్యర్థిగా సునీత లక్ష్మా రెడ్డి పేరును ఖరారు చేశారు. బుధవారం జగ్గారెడ్డిని బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన సమాచారం తెలుసుకున్న దిగ్విజయ్ విస్తుబోయారు.

 జగ్గారెడ్డి

జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి

కొత్త ప్రభాకర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మెదక్ ఉప ఎన్నికల బరిలో నిలబడిన కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం. పక్కన హరీష్ రావు, బాబుమోహన్ తదితరులు. కాగా, హరీష్ రావు ఈ సందర్బంగా బీజేపీ, టీడీపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సునీత లక్ష్మా రెడ్డి

సునీత లక్ష్మా రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ ఉప ఎన్నికల బరిలో నిలబడిన మాజీ మంత్రి సునీత లక్ష్మా రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం. పక్కన విహెచ్ తదితరులు.

జగ్గారెడ్డి

జగ్గారెడ్డి

బీజేపీ పార్టీ తరఫున మెదక్ ఉప ఎన్నికల బరిలో నిలబడిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం. పక్కన టీడీపీ, బీజేపీ నేతలు.

English summary
Political activity picked up momentum in the district as contestants from the main political parties filed nominations for the Lok Sabha by-poll here on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X